దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (68) ఈ తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పులివెందులలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. వివేకానంద రెడ్డి గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన మృతి వార్తతో కడప జిల్లా విషాదంలో మునిగిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ఈ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వివేకా మృతితో వైసీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

గుండెపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *