ys jagan mohan reddy stricts to mininters

మంత్రులు, అధికారులకు చెక్ పెట్టిన జగన్

కొన్నికొన్ని విషయాలలో చూసీచూడనట్లుగా పోయే సీఎం జగన్ వైఖరితో కొద్దిమంది మంత్రులు, సీనియర్ అధికారులు సొంత శైలిలో వెళ్తున్నారన్న విమర్శలున్నాయి. తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవడానికి బాగా ప్రయారిటీ ఇస్తున్నారని.. ఈ క్రమంలో ఒక్కోసారి జగన్ కంటే తమనే ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే, ఇలాంటివారందరికీ జగన్ ఒక్క మాటతో చెక్ పెట్టశారు. ఇకపై ప్రభుత్వ పథకాల ప్రచారంలో తన ఫొటో తప్ప వేరే ఎవ్వరి ఫొటో ఉండడానికి వీల్లేదని తేల్చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాలు, శాఖల అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.

ఫ్లెక్సీలు, కరపత్రాలు , గోడపత్రాలపై అధికారుల ఫొటోలు కూడా ప్రచురిస్తుండడం విమర్శల పాలైన సంగతి తెలిసిందే. దీంతో కేవలం ముఖ్యమంత్రి ఫొటోనే వాడాలని నిర్దేశించింది . కేవలం టీవీలు, పత్రికా ప్రకటనల్లోనే కాకుండా… సామాజిక మాధ్యమాలు సహా అన్ని రకాల ప్రచారంలోనూ ముఖ్యమంత్రి ఒక్కరి ఫొటోనే వినియోగించాలని స్పష్టంచేసింది.

2003, 2004 , 2012 సంవత్సరాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లాయి. కాగా మంత్రులు, అధికారులు ఇష్టారాజ్యంగా ఫొటోలు వేసుకుంటుండడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, నేరుగా ఈ మాట చెబితే బాగుండదు కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను ముందు పెట్టి ఈ ఆదేశాలిచ్చినట్లుగా చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *