జర్నలిస్ట్ హెల్త్ స్కీం గడువు పెంపు

విజయవాడ, ఆగస్టు 13: రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ స్కీం రెన్యువల్, నూతన నమోదు కోసం గడువును పది రోజుల పాటు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబు రెడ్డి చెప్పారు. ఈ స్కీం నమోదు, రెన్యువల్ గడువు ఆగస్టు 13 వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో మంగళవారం నాడు డిల్లీబాబు రెడ్డి సమాచార, పౌరసంబంధాల శాఖ ఉన్నతాధికారులతో సంప్రదించారు.

వరుసగా బ్యాంక్ సెలవులు రావడం, ఆన్ లైన్ నమోదుకు సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఎక్కువ మంది జర్నలిస్టులు ఈ పథకాన్ని రెన్యువల్ చేసుకోవడంలో, నూతనంగా నమోదు చేసుకోవడంలో విఫలమయ్యారని డిల్లీబాబు రెడ్డి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మరో పది రోజులు పాటు గడువు పెంచేందుకు అధికారులు అంగీకరించారు.
*ఆన్లైన్ లో జర్నలిస్టు హెల్త్ స్కీం నమోదు ఇలా…..

వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం కు ప్రభుత్వంనకు చెల్లించవలసిన 1250 రూపాయలను ఆన్లైన్ లో చెల్లించవచ్చు.

cfms.ap.gov.in వెబ్ సైట్ లోనికి వెళ్లగానే

సిటీజన్ సర్వీసెస్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే

ప్రారంభంలోనే రిసెపిటిస్ లింక్స్ క్రింద పీడీ చలానా ఉంటుంది.

పీడీ చలానా క్లిక్ చేయగానే

డిపార్టుమెంటు , సర్వీస్ అని రెండు కాలమ్స్ వస్తాయి.

డిపార్టుమెంటు కాలమ్ లోనికి వెళ్లి దిగువన GDO2 వున్న దాన్ని క్లిక్ చేయాలి

సర్వీస్ కాలమ్ లో 7036 నెంబర్ రాయాలి వెంటన్ పీడీ చలానా ఓపెన్ అవుతుంది.

తొలి మూడు కాలమ్స్ నింపి ఉంటాయి.

జిల్లా వున్న కాలమ్ లో 27 ఏపీ క్యాపిటల్ రీజియన్ అని టైపు చేసి క్రింద వున్న ట్రెజరీ కాలమ్ లో 2703అని టైపు చేస్తే ఏపీ స్టేట్ క్యాపిటల్ రీజియన్ అని వస్తుంది

క్రింద వున్న DDO కాలమ్ లో 27030802003 ని ఎంటర్ చేసి సబ్మిట్ దగ్గర క్లిక్ చేయగానే వచ్చే ఫారం లో మన డిటైల్స్ నింపగానే

క్రింద నెట్ బ్యాంకింగ్, మాన్యువల్, ఆర్టిజిస్ ఆప్షన్లు వస్తాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయగానే చలనా వస్తుంది దాన్ని డౌన్ లోడు చేసుకొవాలి.

ఒకవేళ మాన్యువల్ అయితే డీటెయిల్స్ నింపిన పారాన్ని (చలనా) డౌన్లోడ్ చేసుకొని బ్యాంక్ లో పేమెంట్ చేసిన తర్వాతతర్వాతm చలనా ఇస్తారు.

చలానను , అక్రిడేషన్ కార్డు, హెల్త్ కార్డుల ( రెన్యూవల్స్ వారు అయితే ) జెరాక్స్ ను డిపిఆర్వో కార్యాయలంలో అందచేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *