Nirbhaya,Convicts,Mukesh Singh,Ram Singh,Ravidas Colony,Tihar Jail

ఢిల్లీ మురికివాడలో నిర్భయ దోషుల తల్లులు.. ఊరడించిన బంధువులు!

నేరం జరిగిన ఏడేళ్ల తర్వాత నిర్భయ దోషులకు నిన్న ఉరిశిక్ష అమలు చేశారు. ఉరితీత తర్వాత నిర్భయ తల్లి సహా దేశం మొత్తం హర్షం వ్యక్తం చేసింది. అయితే, తీహార్ జైలుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మురికివాడ రవిదాస్ కాలనీ మాత్రం విషాదంలో మునిగిపోయింది.

నిర్భయ దోషులు ఆరుగురిలో నలుగురు ఇక్కడివారే. వారిలో ఒకడైన బస్సు డ్రైవర్ రాంసింగ్ 2013లో జైలు గదిలో ఉరివేసుకుని చనిపోయాడు. అతడి సోదరుడు ముఖేశ్ సింగ్‌కు కూడా మరణశిక్ష పడిన తర్వాత వారి తల్లి అక్కడ ఉండలేకపోయింది. రాజస్థాన్‌లోని సొంత ఊరికి వెళ్లిపోయింది. వినయ్‌శర్మ, పవన్ గుప్తా కుటుంబాలు కూడా ఇక్కడే ఉండేవి.

నిన్న వారికి ఉరిశిక్ష అమలు చేస్తున్నప్పుడు వారి తల్లుల రోదనలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. జైలులో ఉన్నా బతికి ఉన్నారని అనుకునేవారమని, ఇప్పుడు కళ్లముందే కానరాని లోకాలకు వెళ్లిపోయారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఊరడించేందుకు బంధువులు కష్టపడాల్సి వచ్చింది. వారి రోదనలతో ఆ మురికివాడ మొత్తం విషాదంతో నిండిపోయింది.
Tags: Nirbhaya,Convicts,Mukesh Singh,Ram Singh,Ravidas Colony,Tihar Jail

mukesh singh,supreme court,nirbhaya,lawyers

నిర్భయ కేసులో మరో ట్విస్ట్: తన లాయర్లపైనే కోర్టుకెక్కిన దోషి ముకేశ్ సింగ్

నిర్భయ దోషి ముకేశ్ సింగ్ మరోమారు కోర్టుకెక్కాడు. అయితే, ఈసారి ఉరిశిక్ష అమలును నిలిపివేయమనో, ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చమనో కాదు. తన లాయర్లపైనే ఆరోపణలు చేశాడు. వారు తనను తప్పుదారి పట్టించారని, చట్టపరంగా తనకుండే అవకాశాలను మళ్లీ వినియోగించుకునేందుకు అనుమతించాలని కోరుతూ నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ముకేశ్ తరపున ఎంఎల్ శర్మ అనే న్యాయవాది క్యురేటివ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన విషయంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు ఢిల్లీ సర్కారు, అమికస్ క్యూరీగా వ్యవహరించిన వ్రిందా గ్రోవర్‌లు నేరపూరిత కుట్రకు పాల్పడి తనను మోసం చేశారని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోరాడు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Tags: mukesh singh,supreme court,nirbhaya,lawyers

supreme court,nirbhaya,execution convicts

నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీస్తాం.. సుప్రీంలో కేంద్రం పిటిషన్, రేపు విచారణ

  • ఒకరొకరుగా పిటిషన్లు వేస్తూ జాప్యం జరిగేలా చేస్తున్న దోషులు
  • సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్న కేంద్రం
  • వేర్వేరుగా శిక్ష అమలు చేసేలా అనుమతివ్వాలని వినతి

  నిర్భయ కేసులో ఉరిశిక్ష పడినవారందరికీ ఒకేసారి కాకుండా వేర్వేరుగా శిక్ష అమలు చేసే అవకాశం ఇవ్వాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. ఏదైనా కేసులో ఒకే శిక్ష పడిన వారందరికీ ఒకేసారి అమలు చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా నిర్భయ దోషుల ఉరి అమలు వాయిదా పడుతూ వస్తోంది.

  వేర్వేరుగా పిటిషన్లు వేస్తూ..

  దోషులు ఒకరొకరుగా కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు వేస్తూ పోవడం, తర్వాత ఒకరొకరుగా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం, సుప్రీం ఆదేశాలపై రివ్యూ పిటిషన్లు వేయడం వంటివి చేస్తూ.. ఉరిశిక్ష అమలుకాకుండా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి వేర్వేరుగా శిక్ష అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

  ఒక్కరికి ఆప్షన్లు మిగిలాయి

  నిర్భయ కేసులో ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తాలకు ఉరిశిక్ష పడింది. ఈ నలుగురిలో పవన్ గుప్తా మినహా మిగతా వారంతా కోర్టుల్లో పిటిషన్లు వేసి, రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం వెళ్లి అన్ని మార్గాలను వినియోగించుకున్నారు. పవన్ గుప్తాకు క్యూరేటివ్ పిటిషన్, ఆపై రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ వేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. అందరికీ ఒకేసారి శిక్ష అమలు చేయాలన్న తీర్పు నేపథ్యంలో నలుగురి ఉరిశిక్ష అమలు వాయిదా పడుతూ వస్తోంది. దీంతో వేర్వేరుగా శిక్ష అమలు కోసం కేంద్రం పిటిషన్ వేసింది.

  దోషుల తీరుతో సమస్యలు

  దోషుల తీరు వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని కోర్టుకు విన్నవించింది. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత విచారణ జరుపుతామని కోర్టు ప్రకటించింది. ఇక పవన్ గుప్తా విషయంగా త్వరగా తేల్చేందుకు సీనియర్ అడ్వొకేట్ అంజనా ప్రకాశ్ ను అమికస్ క్యూరీ (కోర్టు సహాయకులు)గా నియమించింది.

  Tags: supreme court,nirbhaya,execution convicts

Nirbhaya, New Delhi, central govt, dec 16th

నిర్భయ అత్యాచారానికి గురైన డిసెంబర్‌ 16నే దోషులకు ఉరిశిక్ష అమలు!

వెల్లడించిన తిహార్ జైలు అధికారులు
కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు
నలుగురికి ఉరి శిక్ష
అది 2012, డిసెంబర్‌ 16వ తేదీ.. ఢిల్లీలో ఆరుగురు మృగాళ్లు నిర్భయపై దాడి చేసి అత్యాచారం చేశారు. యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది ఈ ఘటన. ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిర్భయ మృతి చెందింది. ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడిన డిసెంబర్‌ 16నే ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయనున్నారు.

ఈ నెల 16న ఉదయం 5 గంటలకు నలుగురు దోషులకు ఈ శిక్ష అమలు చేస్తున్నట్లు తిహార్‌ జైలు అధికారులు చెప్పారు. తమకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఆదేశాలు అందినట్లు తెలిపారు. ప్రస్తుతం దోషులు తిహార్‌ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. వారిని ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులుగా తేలిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు జూవైనల్‌ కోర్టు విధించిన శిక్ష అనుభవించాడు. మరో దోషి రామ్‌సింగ్‌ జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దోషులకు శిక్ష అమలులో జరిగిన ఆలస్యంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
Tags: Nirbhaya, New Delhi, central govt, dec 16th