Andhra Pradesh, IPS Officers, Transfers, AP cm ys jagan

ఏపీలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు.. ఎవరెవరు, ఎక్కడికి బదిలీ అయ్యారంటే..?

ఏపీలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదీలీలు జరిగాయి. 17 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారలు వివరాలు ఇవే.

ఐపీఎస్ అధికారి పేరు
బదిలీ అయిన స్థానం
ద్వారకా తిరుమలరావు
రైల్వే డీజీపీ
బి. శ్రీనివాసులు
విజయవాడ సిటీ కమిషనర్
ఎన్. బాలసుబ్రహ్మణ్యం
ఏడీజీపీ ఆర్గనైజేషన్
కృపానండ్ త్రిపాఠి ఉజాలా
రోడ్ సేఫ్టీ ఏడీజీపీ
పిహెచ్డీ రామకృష్ణ
ఎస్ఈబీ డైరెక్టర్
ఆర్ఎన్ అమ్మిరెడ్డి
గుంటూరు అర్బన్ ఎస్పీ
అమిత్ బర్దార్
శ్రీకాకుళం ఎస్పీ
బి. ఉదయ్ భాస్కర్
డీజీపీ ఆఫీస్ అడ్మిన్
ఐశ్వర్య రస్తోగి
విశాఖ లాండ్ ఆర్డర్
అట్టాడా బాబూజీ
ఎస్ఐబీ ఎస్పీ
బి. కృష్ణారావు
విశాఖ రూరల్ ఎస్పీ
సిహెచ్. విజయారావు
విజయవాడ రైల్వే ఎస్పీ
నారాయణ నాయక్
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ
నవదీప్ సింగ్ గ్రేవాల్
సీఐడీ ఎస్పీ
విశాల్ గున్నీ
గుంటూరు రూరల్ ఎస్పీ
ఎస్. రంగారెడ్డి
డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశం
దీపిక
‘దిశ’ ప్రత్యేక అధికారిగా ఉన్న ఆమెకు… ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్ గా పూర్తి అదనపు బాధ్యతలు

Tags: Andhra Pradesh, IPS Officers, Transfers, AP cm ys jagan

Chandrababu, Telugudesam, Andhra Pradesh

ఈ వీడియో చూసి షాక్‌ అయ్యాను!: చంద్రబాబు ట్వీట్

విజయనగరంలో చారిత్రక కట్టడం మూడు లాంతర్ల స్తంభాన్ని మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడాన్ని చూసి షాకయ్యానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. అశోక్ గజపతి రాజు కుటుంబం ఆ ప్రాంతానికి అందించిన సాయానికి సంబంధించి గుర్తులను ఉద్దేశపూర్వకంగా తుడిచేయడానికి జగన్‌ పాల్పడుతున్న చర్యల్లో ఇదొకటని చంద్రబాబు విమర్శించారు.

చరిత్రను కాలరాస్తూ ఇటువంటి నీచ రాజకీయాలకు ప్రాధాన్యతనివ్వకూడదని హితవు పలికారు. కాగా, రాజుల కాలం నాటి మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చివేసిన కట్టడం స్థలంలో కొత్త చిహ్నాన్ని నిర్మించేందుకు అధికారుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
Tags: Chandrababu, Telugudesam, Andhra Pradesh

Corona Virus, COVID-19, Andhra Pradesh

ఏపీలో మరో 48 మందికి కరోనా.. కర్నూలులో 591కి చేరిన కేసులు

గత 24 గంటల్లో 9,284 శాంపిళ్ల పరీక్ష
24 గంటల్లో 86 మంది డిశ్చార్జ్‌
కేసుల సంఖ్య మొత్తం 2,137
ఆసుపత్రుల్లో 948 మందికి చికిత్స
ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్న కొద్దీ కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 9,284 శాంపిళ్లను పరీక్షించగా మరో 48 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 86 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,137గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 948 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,142 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటివరకు ఏపీలో 47 మంది కరోనా వల్ల మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో 11, తూర్పు గోదావరిలో 4, గుంటూరులో 12, కృష్ణాలో 3, కర్నూలులో 7 చొప్పున కేసులు నమోదయ్యాయని వివరించింది.ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మరో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కర్నూలులో కరోనా నిర్ధారిత కేసులు 591కి చేరాయి.
Tags: Corona Virus, COVID-19, Andhra Pradesh

New Delhi,Trains,Reservation,Andhra Pradesh,Telangana

రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా తిరిగే రైళ్ల వివరాలు!

సుమారు 50 రోజుల తరువాత రేపటి నుంచి ప్రజల కోసం కొన్ని రైళ్లను నడపాలని నిర్ణయించిన రైల్వే శాఖ, టికెట్ రిజర్వేషన్ ను నేటి సాయంత్రం నుంచి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. మొత్తం 15 జతల రైళ్లు, న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్, విజయవాడ తదితర నగరాల మధ్య తిరగనున్నాయి. ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు చేసిన తరువాతనే రైళ్లలోకి అనుమతిస్తామని, ప్రతి ఒక్కరూ మాస్క్ లను ధరించాలని స్పష్టం చేసిన రైల్వే శాఖ, బుకింగ్ కౌంటర్స్ వద్ద టికెట్లను విక్రయించడం లేదని స్పష్టం చేసింది.

హౌరా – న్యూఢిల్లీ, రాజేంద్రనగర్ – న్యూఢిల్లీ, డిబ్రూగఢ్ – న్యూఢిల్లీ, న్యూఢిల్లీ – జమ్మూతావి, బెంగళూరు – న్యూఢిల్లీ, తిరువనంతపురం – న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ – న్యూఢిల్లీ, బిలాస్ పూర్ – న్యూఢిల్లీ, రాంచీ – న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్ న్యూఢిల్లీ, అహ్మదాబాద్ – న్యూఢిల్లీ, అగర్తలా – న్యూఢిల్లీ, భువనేశ్వర్ – న్యూఢిల్లీ, మడ్ గావ్ – న్యూఢిల్లీ, సికింద్రాబాద్ – న్యూఢిల్లీల మధ్య రైళ్లు తిరుగుతాయి.

ఇక రేపటి నుంచి తిరిగే రైళ్లలో తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలను పరిశీలిస్తే…

* బెంగళూరు, న్యూఢిల్లీ మధ్య రోజూ తిరిగే రైలు, శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, రాయచూరు సికింద్రాబాద్, కాజీపేటల మీదుగా ప్రయాణిస్తుంది. బెంగళూరులో రాత్రి 8 గంటలకు, న్యూఢిల్లీలో రాత్రి 8.45 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది.
* న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ మధ్య శుక్ర, ఆదివారాల్లో, తిరుగు ప్రయాణంలో బుధ, శుక్ర వారాల్లో నడిచే రైలు, విజయవాడ, వరంగల్ నగరాల మీదుగా ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు, చెన్నై సెంట్రల్ లో ఉదయం 6.05 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి.
* సికింద్రాబాద్, న్యూఢిల్లీ మధ్య బుధవారం, తిరుగు ప్రయాణంలో ఆదివారం బయలుదేరే రైలు కాజీపేట మీదుగా సాగుతుంది. సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 12.45 గంటలకు, న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి.
Tags: New Delhi,Trains,Reservation,Andhra Pradesh,Telangana

Corona Virus, COVID-19, Andhra Pradesh

ఏపీలో 24 గంటల్లో మరో 43 మందికి కరోనా.. 44కి చేరిన కరోనా మృతుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,388 శాంపిళ్లను పరీక్షించగా 43 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,930గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 887 మంది డిశ్చార్జ్ కాగా, 44 మంది మరణించారని వివరించింది.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 999గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో 11, గుంటూరులో 2, కృష్ణాలో 16, కర్నూలులో 6, విశాఖపట్నంలో 5 కేసులు నమోదయ్యాయి.
Tags: Corona Virus, COVID-19, Andhra Pradesh

Jagan,YSRCP,Andhra Pradesh,Corona Virus

కాసేపట్లో అధికారులతో ఏపీ సీఎం జగన్ కీలక భేటీ

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు అధికారులతో సాయంత్రం వరకు సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా ఉండనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణ చర్యలపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాసేపట్లో ఆయన అధికారులతో భేటీ కానున్నారు.

ఈ సమావేశం అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తారు. విశాఖపట్నంలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో గ్యాస్ లీక్‌ ఘటనపై కూడా జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అధికారులు సమన్వయంతో అక్కడి పరిస్థితులు పర్యవేక్షించడానికి జగన్ సూచనలు చేయనున్నారు. బాధితులకు అందాల్సిన ఆర్థిక సాయంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Tags: Jagan,YSRCP,Andhra Pradesh,Corona Virus

Vizag,Vizag Gas Leak,Andhra Pradesh

నిన్న రాత్రి బ్లాస్టింగ్‌ జరిగిందని కొందరు వదంతులు సృష్టించారు.. అలాంటిదేమీ లేదు: ఏపీ మంత్రులు

విశాఖ నగరంలో నిన్న రాత్రి గ్యాస్ లీకేజీ మరోసారి జరిగిందని ప్రచారం జరిగింది. ఎల్జీ పాలిమర్స్ నుంచి మరోసారి గ్యాస్ లీకవుతున్నట్లు సమాచారం రావడంతో స్థానికులు రోడ్లపైకి వచ్చి సురక్షిత ప్రాంతాలవైపు పరుగులు తీశారు. ఈ విషయంపై ఏపీ మంత్రులు స్పందించి స్పష్టతనిచ్చారు.

‘నిన్న రాత్రి బ్లాస్టింగ్‌ జరిగిందని కొందరు సోషల్‌ మీడియాలో వదంతులు సృష్టించారు, అలాంటి పరిస్థితులేమి లేవు. నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పనిచేస్తున్నారు. ఇవాళ మంత్రుల బృందం భేటీ అయ్యి, 3 అంశాలపై చర్చించబోతుంది’ అని ఏపీ మంత్రి కన్నబాబు వివరించారు.

‘సీఎం జగన్‌ గారి ఆదేశాల మేరకు పరిశ్రమల్లో భద్రతపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నాం. ప్రజలు పూర్తిగా భద్రతలో ఉన్నామన్న భావన కల్పించేలా చర్యలు తీసుకుంటాం. ఫ్యాక్టరీ తెరవాలా? వద్దా? అన్నది నిపుణుల అధ్యయనంలో వెల్లడవుతుంది. ఎవరూ ఆందోళన చెందవద్దు’ అని కన్నబాబు చెప్పారు.

ఇదే విషయంపై మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ… ‘ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావద్దు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నాం. బాధిత గ్రామాల ప్రజల కోసం షెల్టర్స్‌ ఏర్పాటు చేశాం. ఎవరూ ఇబ్బంది పడకుండా మంచి భోజనం అందేలా ఏర్పాట్లు చేశాం, వసతి సదుపాయాలు కల్పించాం’ అని చెప్పారు.

‘ఎల్జీ పాలిమర్స్‌లో బ్లాస్ట్‌ అయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు, పరిస్థితి అంతా అదుపులోనే ఉంది. గుజరాత్‌, నాగపూర్‌ నుంచి వచ్చిన నిపుణులు, నెమ్మదిగా విష వాయువులను కంట్రోల్‌ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం, లేదా రేపటి లోగా పూర్తిగా అదుపులోకి వస్తుంది’ అని వివరించారు.
Tags: Vizag,Vizag Gas Leak,Andhra Pradesh

Chandrababu,Telugudesam,Andhra Pradesh,Vizag Gas Leak

గ్యాస్ లీకేజీపై సీఎం జగన్‌ చేసిన ప్రకటన సరికాదు: చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎల్జీ పాలిమర్స్ వంటి పరిశ్రమల్లో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. ఈ పరిశ్రమ అత్యవసర సేవల విభాగం కిందకు రాదు కదా? అని ప్రశ్నించారు.

అలాంటప్పుడు ఇప్పుడు దీన్ని తెరవడమేంటని చంద్రబాబు నిలదీశారు. ఇలాంటి పరిశ్రమలకు అనుమతి ఇచ్చేటప్పుడు నిబంధనలు పాటించాలని చెప్పారు. జనావాసాల మధ్య ఇలాంటి పరిశ్రమలు ఉండడం సరికాదని తెలిపారు. స్టిరీన్ లీక్ ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పారు.

‘ఎవరికీ ప్రాణాలు తీసే హక్కు లేదు.. ఏదైనా ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే కేవలం ఆ ఫ్యాక్టరీలోని కార్మికులే చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ, మొదటిసారి ఏపీలో సాధారణ ప్రజలు ఇలా చనిపోయారు. ఇందుకు కారణమైన వారు ఎంతటి వారైనా వదలిపెట్టడానికి వీల్లేదు. విశాఖలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. జనాలు చాలా భయంతో నిన్న పరుగులు తీశారు’ అని చంద్రబాబు అన్నారు.

లాక్‌డౌన్‌ వల్లే ప్రమాదం జరిగిందా? అన్న విషయంపై కూడా దర్యాప్తు జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమలో ఉన్న సైరన్‌ కూడా మోగలేదని ఆయన చెప్పారు. దీనిపై సీఎం జగన్‌ స్పందించిన తీరు బాగోలేదని ఆయన అన్నారు. ఇలాంటి ప్రమాదాలను తేలికగా తీసుకునే విధంగా ఆయన చేసిన ప్రకటన ఉందని చెప్పారు.

ఈ ఘటనను హైకోర్టు, ఎన్‌హెచ్‌ఆర్సీ, ఎన్జీటీ సుమోటోగా తీసుకున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గ్యాస్‌ లీక్‌ ఘటనపై సమీక్ష చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై తూతూ మంత్రంగా దర్యాప్తు చేస్తుండడం సరికాదని అన్నారు. ఈ ఘటనపై ఆయా రంగాల్లోని నిపుణులు మాత్రమే విచారణ జరపాలని సూచించారు. ఆ కంపెనీ యాజమాన్యంపై సాధారణ కేసులు మాత్రమే పెట్టడమేంటని నిలదీశారు.
Tags: Chandrababu,Telugudesam,Andhra Pradesh,Vizag Gas Leak

Devineni Uma,Jagan,Andhra Pradesh,Liquor Sales,Lockdown,Corona Virus

తాడేపల్లి రాజప్రాసాదం వీడి ప్రజల కష్టాలు తెలుసుకోండి జగన్ గారూ!: దేవినేని ఉమ

మద్యం అమ్మకాల అంశం ఏపీలో అధికార, విపక్షాల మధ్య మరింత ఆజ్యం పోసింది. నిన్నటినుంచి విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. సీఎం జగన్ తాడేపల్లి రాజప్రాసాదం వీడి ప్రజల కష్టాలు తెలుసుకోవాలని హితవు పలికారు. లాక్ డౌన్ వల్ల పనులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సంపద సృష్టించడం చేతకాని ప్రభుత్వం విద్యుత్ చార్జీలు, మద్యం అమ్మకాల ద్వారా పేద, మధ్య తరగతి వర్గాల నడ్డి విరిచి ఆదాయం రాబట్టుకోవాలనుకుంటోందని విమర్శించారు. ఇలాంటి చర్యలు సీఎం అనుభవలేమికి నిదర్శనాలని ట్వీట్ చేశారు.
Tags: Devineni Uma,Jagan,Andhra Pradesh,Liquor Sales,Lockdown,Corona Virus

Andhra Pradesh, Telangana, Border, Vehicles, Stop

తెలంగాణ వాహనాలను అడ్డుకున్న ఏపీ, ఏపీ వాహనాలను అడ్డుకున్న తెలంగాణ… రోడ్లపై వేలాది మంది!

అధికారుల మధ్య సమన్వయ లోపం, వేలాది మంది తెలుగు రాష్ట్రాల ప్రజలను నడిరోడ్డుపై నిలిపింది. లాక్ డౌన్ నుంచి సడలింపులు రావడం, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలు, స్వస్థలాలకు వెళ్లేందుకు పరిమితులతో కూడిన అనుమతులు రావడంతో భారీ సంఖ్యలో ప్రజలు రాష్ట్రాలు దాటేందుకు సరిహద్దులకు చేరుకున్న వేళ, అధికారులు వారిని అడ్డుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళుతున్న వారిని ఏపీ పోలీసులు అడ్డుకోగా, ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్ద రాష్ట్రాలు దాటేందుకు పాస్ లు ఉన్నప్పటికీ, పట్టించుకోకుండా రోడ్లపైనే నిలిపివేశారు.

దీంతో ఇరు రాష్ట్రాల మధ్యా కర్నూలు, నాగార్జున సాగర్, కోదాడ తదితర ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్టుల వద్ద ప్రజలు భారీ సంఖ్యలో చిక్కుకుని పోయి, పోలీసులతో వాగ్వాదానికి దిగడం కనిపించింది. నిన్న సాయంత్రం నుంచి బయలుదేరిన వారంతా, ఈ ఉదయం వరకూ సరిహద్దుల వద్దే ఉండిపోయారు. దీంతో సరిహద్దుల వద్ద భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే ఉన్నతాధికారులు కల్పించుకుని, తాము స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించాలని పలువురు డిమాండ్ చేశారు.
Tags: Andhra Pradesh, Telangana, Border, Vehicles, Stop