ఆగస్టు 5న చిన్న పత్రికల సమావేశం

విజయవాడ, జూలై 31: ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కు అనుబంధంగా పని చేస్తున్న స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విస్తృత స్థాయి సమావేశం ఆగస్టు 5వ తేదీన విజయవాడలో నిర్వహించనున్నారు. పటమట ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా గల తోట వారి వీధిలోని ఎపిఎంఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎస్.వీరభద్రరావు అధ్యక్షత వహిస్తారు.

ఎపిఎంఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబు రెడ్డి ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. రాష్ర్టంలో చిన్న, మధ్యతరహా పత్రికలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం నుండి చిన్న, మధ్యతరహా పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు మంజూరు కోరడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన ప్రకటనల బిల్లుల బకాయిల సాధన కోసం చేపట్టవలసిన కార్యాచరణపై చర్చిస్తారు. వివిధ జిల్లాల నుండి హాజరయ్యే అసోసియేషన్ సభ్యులు సైతం అధ్యక్షుని అనుమతితో పలు సమస్యలపై చర్చిస్తారు. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్యతరహా పత్రికల పబ్లిషర్లు, ఎడిటర్లు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా అసోసియేషన్ కార్యదర్శి బి. సతీష్ బాబు ఒక ప్రకటనలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *