13న రాష్ట్ర బడ్జెట్

ఈ నెల 10 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 13న రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 2017-18 బడ్జెట్ సంక్షేమ ఫలాలు ప్రజలకు మరింత గొప్పగా అందేలా ఉంటుందని ఈటల రాజేందర్ తెలిపిన విషయం విదితమే. సబ్‌ప్లాన్ నిబంధనలకు లోబడే దళిత, గిరిజన వర్గాలకు పూర్తి స్థాయి నిధులు కేటాయిస్తామన్నారు. రుణపరిమితికి లోబడే అప్పులు తెస్తున్నామని స్పష్టం చేశారు. విభజన తర్వాత తొలిసారి రూ. లక్ష కోట్ల బడ్జెట్, రెండోసారి రూ. లక్షా 30 వేల కోట్లకు పైగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు.
TELANGANA , BUDGET 2017-18 , BUDGET , CM KCR , EETALA RAJENDER