రిపోర్టర్స్ పై చేయిచేసుకున్న సంజయ్ బాడీగార్డ్స్!

జైలు నుండి విడుదలైన తర్వాత కొన్ని నెలలు తన భార్య మాన్యత, పిల్లలతో కలిసి ప్రపంచాన్ని చుట్టేశాడు సంజయ్ దత్. ఇక తాజాగా ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో భూమి అనే చిత్రాన్ని చేస్తున్నాడు మున్నాభాయ్. ఆగ్రాలో ఈ చిత్రం తొలి షెడ్యూల్ జరుపుకుంటుండగా ఇటీవల షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు విడుదల చేశారు. అయితే చిత్రానికి సంబంధించిన విశేషాలు తెలుసుకునేందుకు షూటింగ్ లొకేషన్ కి వెళ్లిన రిపోర్టర్స్ పై సంజయ్ బాడీ గార్డ్స్ చేయి చేసుకోవడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సంజయ్ తో మాట్లాడేందుకు ప్రయత్నించిన సందర్భంలో వారు అత్యుత్సాహం ప్రదర్శించి దాడి చేసారనేది బాలీవుడ్ టాక్. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది. భూమీ చిత్రం వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ 17వ తేదిన విడుద‌ల కానున్నట్టు తెలుస్తుండగా ఇందులో అదితీరావు హైదరి సంజయ్‌దత్ కూతురు పాత్రలో కనిపించనుంది. తండ్రీ కూతుళ్ల మధ్య కొనసాగే అనుబంధం నేపథ్యంలో భూమి చిత్రం తెరకెక్కుతుంది.