పరిటాల రవి దెబ్బకు జేసీ బ్రదర్స్ పరారయ్యారు

వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలకు లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఉండేందుకు జేసీ బ్రదర్స్ గతంలో మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పరిటాల రవి కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లాలో జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

పరిటాల దెబ్బకు పరార్: జేసీ ప్రభాకర్ రెడ్డి ఊరకుక్కని, గతంలో పరిటాల రవి దెబ్బకు జేసీ బ్రదర్స్ పరారయ్యారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేసీ బ్రదర్స్‌ను అడ్డుపెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తున్నారని, దమ్ముంటే వైఎస్ జగన్‌ను నేరుగా ఎదుర్కోవాలని విమర్శించారు. జేసీ బ్రదర్స్ దిష్టిబొమ్మల దహనం: వైఎస్ జగన్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడంపై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు చాలా ప్రాంతాల్లో జేసీ బ్రదర్స్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ysrcp leaders, diwakar travels, tdp mla, jc prabhakar reddy