కలెక్టర్‌గా నయనతార

నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కుతున్న ‘ఆరమ్‌’ తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదలవుతోంది. గోపి నైనర్‌ దర్శకత్వంలో ఆర్‌.రవీంద్రన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార జిల్లా కలెక్టర్‌గా కనిపించబోతున్నారు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘రాజకీయం నేపథ్యంలో, నాటకీయ పరిణామాలతో ఆసక్తికరంగా సాగే చిత్రమిది. మా టైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై ‘శివలింగ’, ‘విక్రమ్‌ వేదా’ తదితర విజయవంతమైన చిత్రాల్ని నిర్మించాం. 450కి పైగా చిత్రాల్ని పంపిణీ చేశాం. విభిన్నమైన కథల్ని ఎంపిక చేసుకొంటూ వరుస విజయాల్ని సొంతం చేసుకొంటున్నారు నయనతార. అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దార’’న్నారు. విగ్నేష్‌, రమేష్‌, సునులక్ష్మి, వినోదిని వైద్యనాథన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్‌, సంగీతం: జిబ్రాన్‌