అమ్మో! అలాగైతే దెప్పిపొడవరూ!.. టీఆర్ఎస్ ఎంపీ కవిత

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ పత్రికతో మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన టైం టేబుల్‌ గురించి వివరించారు. టైం ఫ్రేమ్, ప్లానింగ్ ఉంటే మహిళల పని సులభమవుతుందన్న ఆమె తాను ఏడాది ప్రారంభానికి ముందే సంవత్సరం మొత్తానికి షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకుంటానని తెలిపారు. తన టైం టేబుల్‌లో పిల్లల పుట్టిన రోజులు, కుటుంబ వేడుకలు కూడా ఉంటాయన్నారు. ఏ ఒక్కదాన్ని మర్చిపోకుండా అన్నింటినీ సరిగ్గా ఓ పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటే ఒత్తిడి తగ్గిపోతుందన్నారు. పనుల్లో పడి ఇంటి విషయాలు మర్చిపోతే.. ‘చూశావా.. పనుల్లో పడి ఇంటి విషయాలు మర్చిపోయింది’ అని దెప్పిపొడుస్తారని అన్నారు. అందుకే ఎవరికైనా ప్లానింగ్ ముఖ్యమని అన్నారు. తనకున్న మరో బలం ఓపెన్ కమ్యూనికేషన్ అని, భర్త, అత్తగారితో ఓపెన్ కమ్యూనికేషన్ ఉండడం వల్ల మనల్ని అర్థం చేసుకుంటారని కవిత వివరించారు.