reliance industries, dtep bsck to AP, investment in ap

ఆంధ్రప్రదేశ్ నుంచి రిలయన్స్, పలు టాప్ కంపెనీల వెనక్కి

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండు ఒప్పందాల్ని కుదుర్చుకుంది. ఇందులో ఒకదాని నుంచి రిలయన్స్ వైదొలగనున్నట్లుగా ప్రచారం జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. తిరుపతి సమీపంలో రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేయదలిచిన ఎలక్ట్రానికి పరికరాల మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఆలోచనను విరమించుకుందట. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్లాంట్ కోసం అప్పుడే భూములు కేటాయించింది. ఇందులో కొన్ని కోర్టు కేసుల్లో చిక్కుకున్నాయట.

రెండింట ఓ పరిశ్రమపై వెనక్కి తగ్గిన రిలయన్స్? రూ.52 వేల కోట్లతో ఏపీలో రెండు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గత టీడీపీ ప్రభుత్వం, రిలయన్స్ మధ్య ఎంవోయులు కుదిరాయి. వాటిలో ఒకటి తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమ, రెండోది కాకినాడ సమీపంలో చమురు సహజవాయు నిక్షేపాలు వెలికితీసే ప్రాజెక్టు. ఇందులో తిరుపతి ఎలక్ట్రానికి పరికరాల పరిశ్రమపై ఆ కంపెనీ తగ్గిందని వార్తలు వస్తున్నాయి. కేజీ బేసిన్లో చమురు, సహజవాయు నిక్షేపాల్ని వెలికితీసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని కొనసాగించేందుకు మాత్రం సుముఖంగా ఉన్నారట. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో పలు ఎంవోయులు జరిగాయని వాటిలో చాలామంది ముందుకు రావడం లేదని, రిలయన్స్ పరిస్థితి అలాగే ఉందని మంత్రి గౌతమ్ రెడ్డి చెబుతున్నారట.
Tags: reliance industries, dtep bsck to AP, investment in ap

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *