మాకు ఇప్పుడు చేతి నిండా పని ఉంది: ఇస్రో చైర్మన్ శివన్

ఈ రోజు ఉదయం ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ 47 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. పీఎస్ఎల్వీ సీ 47 ద్వారా 14 ఉపగ్రహాలను నింగిలో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ… ఈ ప్రయోగంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.

వచ్చే ఏడాది మార్చి వరకు తమకు 13 మిషన్లు ఉన్నాయని శివన్ చెప్పారు. తమకు ఇప్పుడు చేతి నిండా పని ఉందని అన్నారు. తమ వద్ద సందర్భానికి తగట్లుగా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను కూడా ఇస్రో నింగిలోకి పంపిందని తెలిపారు. పీఎస్ఎల్వీ సీ 47 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రోకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
Tags: pslv isro, isro chairman shivan, pslv47 details, satilites

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *