లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన పంపన

అమరావతి, మార్చి 13: తూర్పుగోదావరి జిల్లా బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరారు. బుధవారం రాత్రి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి తన అనుచరులతో కలిసి వచ్చిన రామకృష్ణకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేష్ పసుపు కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. 2రామకృష్ణతో పాటు చేనేత, మత్స్యకార సంఘాలకు చెందిన పలువురు నాయకులు టిడిపిలో చేరారు. వారందరికీ లోకేష్ సాదర స్వాగతం పలికి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మరోసారి రాష్ర్టానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మన బిడ్డలకు బంగారు భవిష్యత్తు కోసం తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, దేశంలోనే అత్యున్నత రాజధానిగా అమరావతిని నిర్మించుకోవాలన్నా మరోసారి టిడిపికి అధికారం ఇవ్వాలని, ఆ దిశగా ప్రజలలో చైతన్యం తీసుకు రావాలని ఆయన కోరారు. See

బిసిల సంక్షేమానికి మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తున్నది టిడిపియేనని ఆయన గుర్తు చేశారు. నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు రాజకీయాలలో బిసిలకు పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. ఇటీవల ఏడు ఎమ్మెల్సీ పదవులు వస్తే అందులో నాలుగు సీట్లు బిసిలకు ఇచ్చామని, రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రజకులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని లోకేష్ అన్నారు. బిసి నాయకులు పంపన రామకృష్ణకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తామని హామీఇచ్చారు. ఇక ఎన్నికల పోలింగ్ కు కేవలం 28 రోజులే సమయం ఉన్నందున ప్రతి ఒక్కరూ ప్రజలలోకి వెళ్ళి ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయాలని ఆయన కోరారు.

మనకు సొంత పత్రికలు, టీవీ ఛానళ్ళు లేవని, కార్యకర్తలే మనకు ప్రచారకర్తలు అని ఆయన అన్నారు. రామకృష్ణతో పాటు పడాల వెంకటేశ్వర్లు, వీరభద్రస్వామి, పి. కృష్ణ, కె. వీరస్వామి, పి. శేషగిరిరావు, పి. నాగేశ్వరరావు, బి.జి.చౌదరి, సి.హెచ్. శ్రీనివాస చౌదరి తదితరులు టిడిపిలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *