అభివృద్ధి ప్రదాతను ఆశీర్వదించండి ఎమ్మెల్సీ రవికిరణ్ వర్మ

దేశ్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆశీర్వదించి మళ్ళీ తెలుగుదేశం పాలన తీసుకురావాలని ఎమ్మెల్సీ కలిదిండి రవికిరణ్ వర్మ పిలుపునిచ్చారు. పి.గన్నవరం మండలం బెల్లంపూడి గ్రామంలో అమలాపురం పార్లమెంట్ టిడిపి అభ్యర్థి గంటి హరీష్ మాథూర్, గన్నవరం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి నేలపూడి స్టాలిన్ లకు మద్దతుగా జరిగిన టిడిపి ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో రవికిరణ్ వర్మ పాల్గొన్నారు. ఆడపడుచులకు పసుపు కుంకుమ, వృద్ధాప్య, వికలాంగ, వితంతు ఫించన్ల పెంపు, యువతకు నిరుద్యోగ భృతి వంటి సంక్షేమ పథకాలతో పాటు లక్షల కోట్ల నిధులు వెచ్చించి అందరినీ ఆకట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా బెల్లంపూడి చర్చిలో టిడిపి గెలుపు కోరుతూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి సభ్యులు డొక్కా నాథ్ బాబు, మండల టిడిపి అధ్యక్షుడు ముత్యాల సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *