చంద్రబాబుతోనే రాష్ట్ర భవిత ఎమ్మెల్సీ రవికిరణ్ వర్మ

చంద్రబాబు నాయుడు పాలనతోనే రాష్ట్ర భవిష్యత్తు మహోజ్వలంగా ఉంటుందని ఎమ్మెల్సీ కలిదిండి రవికిరణ్ వర్మ చెప్పారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబుకు మద్దతుగా అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో రవికిరణ్ వర్మ ఎన్నికల ప్రచారం చేశారు. గత ఐదేళ్ళలో రాష్ర్టంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు వెల్లువలా ముందుకు సాగాయని అన్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలంటే మరోసారి టిడిపి పాలన రావాలని అన్నారు. అమలాపురం పార్లమెంట్ టిడిపి అభ్యర్థి గంటి హరీష్ మాథూర్, గన్నవరం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి నేలపూడి స్టాలిన్ లను సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రవికిరణ్ వర్మ కోరారు. ఈ కార్యక్రమంలో అంబాజీపేట మండల టిడిపి అధ్యక్షుడు గణపతి బాబులు, ఎ.ఎం.సి. మాజీ ఛైర్మన్ అరిగెల బలరామమూర్తి, సొసైటీ అధ్యక్షుడు గణపతి రాఘవులు, నీటి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు, వీరభద్రశర్మ, నాగమల్లేశ్వరరావు, జడ్పీటీసీ బొంతు పెదబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *