డిల్లీబాబు రెడ్డి కృషితోనే చిన్న పత్రికల అడ్వర్టయిజ్మెంట్ టారిఫ్ పెంపు

విజయవాడ, ఆగస్టు 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిన్న పత్రికలకు జారీ చేసే ప్రకటనల రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2011-12 ఆర్థిక సంవత్సరం తరువాత రేటు పెంపు పొందని చిన్న పత్రికలకు 60 శాతం రేటు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది తాము సాధించిన విజయంగా ఒక చిన్న పత్రికల సంఘం ప్రచారం చేసుకోవడం విచారకరం. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా, దానికి అనుబంధంగా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్థాపించిన తిరుపతికి చెందిన ఆశాజ్యోతి సాయంకాల దినపత్రిక సంపాదకులు డిల్లీబాబు రెడ్డి సాధించిన విజయం ఇది.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ నుండి ఎంపానెల్మెంట్ పొందిన చిన్న పత్రికలకు ఒక రేట్ కార్డు ఇచ్చి దాని ప్రకారం ప్రకటనలు జారీ చేసి బిల్లులు చెల్లిస్తుంటారు. ప్రతి సంవత్సరం సమాచార శాఖ అధికారులు ఈ రేట్ పెంచుతూ వస్తుంటారు. కానీ 2011-12 ఆర్థిక సంవత్సరం నుండి ఈ రేట్ కార్డు పెంపుదలను అధికారులు నిలిపివేశారు. దీనిపై పలు చిన్న పత్రికల సంపాదకులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో రాష్ట్రం ఆర్థిక కష్టాలలో ఉన్నదని సాకుగా చూపుతూ ప్రభుత్వం చిన్న పత్రికల రేట్ కార్డు పెంపుదలను వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఈనాడు దినపత్రిక రేటును మాత్రం పెద్ద ఎత్తున పెంచడం జరిగింది. దీనిపై ఆశాజ్యోతి సాయంకాల దినపత్రిక సంపాదకులు డిల్లీబాబు రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు ఇప్పటికీ హైకోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చిన్న పత్రికల రేట్ కార్డు పెంపుదలకు చర్యలు తీసుకోవడం కొంత మేరకు హర్షించవలసిందే. అయితే నిబంధనల మేరకు రేట్ కార్డు పెంచితే చిన్న పత్రికలకు మరింత మేలు జరిగి ఉండేది. ఈ దిశగా తన పోరాటం కొనసాగిస్తానని డిల్లీబాబు రెడ్డి చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చిన్న పత్రికల రేట్ కార్డు పెంపుదల అనేది పూర్తిగా డిల్లీబాబు రెడ్డి గారు సాధించిన విజయం. ఎపిఎంఎఫ్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులుగా ఇది మనందరికీ సంతోషకరం. రేట్ కార్డు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను, డిల్లీబాబు రెడ్డి కోర్టులో వేసిన పిటిషన్ వివరాలు ఈ ప్రకటనతో పాటు పొందుపరుస్తున్నాం. చిన్న పత్రికల సంపాదకులు, ప్రచురణకర్తలు వాస్తవాలు గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *