పచ్చటి సీమలో హరీష్ ప్రచార భేరి రాజోలు దీవిలో భారీ ర్యాలీ

 పచ్చటి సీమలో అమలాపురం పార్లమెంట్ టిడిపి అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ ప్రచార భేరి మ్రోగించారు. రాజోలు దీవిలో పల్లె పల్లెకు వెళ్లి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. మంగళవారం ఉదయం అల్లవరం మండలంలో ప్రచారం ముగించుకుని పాశర్లపూడి వద్ద వైనతేయ వారధి మీదుగా హరీష్ రాజోలు దీనిలోకి ప్రవేశించారు. మామిడికుదురు, నగరం, తాటిపాక సెంటర్, పొదలాడ, సోంపల్లి గ్రామాల మీదుగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన రాజోలుకు హరీష్ ర్యాలీ చేరుకుంది. రాజోలు పట్టణంలో రాజోలు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు తో కలిసి ఎన్నికల ప్రచారం లో హరీష్ పాల్గొన్నారు. రాజోలులో గొల్లపల్లి, హరీష్ సమక్షంలో ప్రముఖ న్యాయవాది పొన్నాడ సూర్యారావు (బబ్బీస్) నివాసంలో పలువురు న్యాయవాదులు టిడిపికి మద్దతు పలికారు. అనంతరం శివకోడు పెద్ద కమ్మపాలెంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలను కలుసుకున్న హరీష్ టిడిపి విజయానికి కష్టించి పని చేయాలని కోరారు. కోనసీమ అభివృద్ధికి తన తండ్రి బాలయోగి చేసిన కృషిని వివరించారు. తన తండ్రి ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో పని చేస్తానని ఆయన చెప్పారు. అక్కడి నుండి రోడ్ షో కొనసాగించిన హరీష్ దిండి, రామరాజులంక, గుడిమెళ్ళంక, మలికిపురం, సఖినేటిపల్లి, కేశనపల్లి ప్రాంతాలలో పర్యటించారు. ఈ రోడ్ షో లో గ్రామ గ్రామాన హరీష్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పలు ప్రాంతాల్లో మహిళలు మంగళహారతులు ఇచ్చి ఆశీర్వదించారు. పలు ఆలయాల్లో హరీష్ ప్రత్యేక పూజలు చేశారు. రాజోలు దీవిలో హరీష్ ర్యాలీలో తెలుగుదేశం బిసి యువ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాస్ మద్దతుదారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగుదేశం జయజయధ్వానాలు చేస్తూ, చంద్రబాబు, లోకేష్ లకు మద్దతుగా నినాదాలు చేస్తూ వారు ర్యాలీలో అగ్రభాగాన నిలిచారు. అమలాపురం పార్లమెంట్ టిడిపి అభ్యర్థి గంటి హరీష్ మాథూర్, రాజోలు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావులకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని దారి పొడవునా వారు నినదించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సభ్యులు రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్సీ కలిదిండి రవికిరణ్ వర్మ, గోదావరి డెల్టా ప్రాజెక్టు ఛైర్మన్ భూపతిరాజు సాయిబాబారాజు, జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి గెడ్డం సింహా, రాజోలు మార్కెట్ కమిటీ ఛైర్మన్ కాకి లక్ష్మణ్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు చెరుకూరి సాయిరామ్, జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల టిడిపి అధ్యక్షులు కోళ్ల వెంకన్న, అడబాల యుగంధర్, గుబ్బల నాగేశ్వరరావు, రాజోలు ఎంపిపి అనుచూరి సునీతా పురుషోత్తం, జడ్పీటీసీ పిల్లి అనంతలక్ష్మీ శ్రీరామమూర్తి, మలికిపురం జడ్పీటీసీ మంగెన భూదేవి, రాజోలు పట్టణ టిడిపి అధ్యక్షులు బేతినీడి శ్రీనివాస్, టిడిపి నాయకులు కసుకుర్తి త్రినాధస్వామి, కసుకుర్తి రామకృష్ణ, బిక్కిన ప్రసాద్, రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి గేదెల వరలక్ష్మి, జిల్లా తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మోకా పార్వతి, టిడిపి నాయకులు ముదునూరి చినబాబు, ముదునూరి శ్రీనివాసరాజు, చెల్లింగి అబ్బులు, కట్టా వెంకట్రాజు, నార్కడమిల్లి కనకం, రావి మురళి, పామర్తి రమణ, గోనిపాటి రాజు, కేతా శ్రీను, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు జగడం సత్యనారాయణ, రాష్ట్ర తెలుగు మహిళ నాయకురాలు కొల్లి నిర్మలకుమారి, మట్టపర్తి లక్ష్మి, చెల్లింగి జాంబవతి, కొత్తపల్లి విజయలక్ష్మి, కోటిపల్లి రత్నమాల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *