Chandrababu, AP, Telugudesam, Lakshmiparvathi, YSRCP, High Court, ACB

వాయిదా పడిన చంద్రబాబు ఆస్తుల కేసు విచారణ…

చంద్రబాబు అక్రమాస్తులు కలిగివున్నాడని లక్ష్మీపార్వతి ఆరోపణ
2005లో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు
హైకోర్టులో స్టే తెచ్చుకున్న చంద్రబాబు
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ వైసీపీ నేత లక్ష్మీపార్వతి అప్పట్లో ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు 14 ఏళ్ల క్రితం దాఖలైంది. దీనిపై విచారణ ప్రారంభం కాక ముందే తన వాదనలు కూడా వినాలంటూ చంద్రబాబునాయుడు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. కానీ ఏసీబీ కోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించడంతో ఆయన హైకోర్టుకు వెళ్లగా, అక్కడ స్టే లభించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ స్టే గడువు ముగిసింది. దీంతో ఈ కేసుపై న్యాయస్థానం ఇటీవల తిరిగి విచారణను మొదలెట్టింది.

ఈ కేసులో లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాల్సి ఉండగా, తన తరఫున సీనియర్ న్యాయవాది హాజరవుతారంటూ లక్ష్మీపార్వతి కోర్టుకు విన్నవించుకున్నారు. అప్పటివరకు విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ కేసు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
Tags: Chandrababu, AP, Telugudesam, Lakshmiparvathi, YSRCP, High Court, ACB

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *