Articles Posted in the " World " Category

 • వరల్డ్ రికార్డు సృష్టించిన భారత వాయుసేన విమానం

  ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించిన సీ-130 సూపర్ హెర్క్యులస్ లాక్ హీడ్ నుంచి కొనుగోలు చేసిన వాయుసేన భారత సైన్యం వద్ద మొత్తం 13 విమానాలు అత్యధిక దూరం ఆగకుండా ప్రయాణించిన విమానం రికార్డును ఇప్పుడు భారత వాయుసేన సొంతం చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-130 సూపర్ హెర్క్యులస్ ప్లేన్ 13 గంటలా 31 నిమిషాల పాటు ఆగకుండా ప్రయాణఇంచిందని, ఇది వరల్డ్ రికార్డని వాయుసేన ఓ ప్రకటనలో వెల్లడించింది. 18వ తేదీన […]


 • పని చేసింది 38 రోజులే.. అయినా అద్భుత సమాచారం ఇచ్చిన ఉపగ్రహం!

  జపాన్‌, నాసా కలసి తయారుచేసిన హిటోమీ ఎక్స్ రే ఉపగ్రహం పాలపుంతల ‘పర్స్యూస్‌’ గుంపు గురించిన కీలక సమాచారం నియంత్రణా వ్యవస్థలోపం కారణంగా నిరుపయోగంగా మారిన ఉపగ్రహం కేవలం 38 రోజులపాటు పని చేసిన హిటోమీ ఎక్స్‌ రే ఉపగ్రహం విశ్వాంతరాళంలోని అద్భుతమైన సమాచారం అందజేసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విశ్వంలో శక్తిమంతమైన విధానాలను అధ్యయనం చేసేందుకు జపాన్‌, నాసా కలసి హిటోమీ ఎక్స్ రే ఉపగ్రహాన్ని తయారు చేశాయి. ఈ ఉపగ్రహం గత ఫిబ్రవరి 17 నుంచి […]


 • అధ్యక్షుడిపై తిరుగుబాటు చేయలేదు

  జింబాబ్వే సైన్యం అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిందన్న వార్తలు తాజాగా కలకలం రేపుతున్నాయి. అయితే సైన్యం దీనిపై వివరణ ఇచ్చింది. తాము ఎలాంటి తిరుగుబాటుకు ప్రయత్నించలేదని బుధవారం ఉదయం అక్కడి అధికారిక మీడియాలో సైన్యం వెల్లడించింది. అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే చుట్టు ఉన్న క్రిమినల్స్‌ను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్‌ చేపడుతున్నామని వివరించింది. ఈ చర్యతో ప్రభుత్వాన్ని సైన్యం చేతుల్లోకి తీసుకున్నట్టు కాదని ఆర్మీ జనరల్‌ ఒకరు తెలిపారు. ‘అధ్యక్షుడు ముగాబే, ఆయన కుటుంబం క్షేమంగా ఉంది.. వారి […]


 • ఇటలీ లేని ప్రపంచకప్‌

  2018 సాకర్‌ సంబరానికి దూరమైన మాజీ ఛాంప్‌ 60 ఏళ్ల తర్వాత టోర్నీకి అనర్హత ఇటలీ ఫుట్‌బాల్‌ అభిమానులకు శరాఘాతం! ఆ దేశ అభిమానులు వచ్చే ఏడాది ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో తమ జట్టును చూడలేరు. ఇటలీ 60 ఏళ్ల విరామం తర్వాత ప్రపంచకప్‌కు దూరమైంది. 1958 ప్రపంచకప్‌ తర్వాతి నుంచి ప్రతిసారీ ఈ మెగా టోర్నీలో ఆడుతూ వస్తున్న ఈ జట్టు.. 2018లో రష్యా ఆతిథ్యమివ్వబోతున్న మెగా టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. ఈ ప్రపంచకప్‌కు దూరమైన అతి […]


 • రెచ్చగొట్టొద్దు.. మ్యాప్ లో కనపడకుండా పోతారు: ట్రంప్

  అణ్వాయుధాలున్నాయన్న అహంకారం వద్దు మాతో పెట్టుకోవద్దు ఉత్తర కొరియా ఒక నరకం అణ్వాయుధాలను పోగేసుకున్నాం అనే అహంకారంతో తమను పదే పదే రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దంటూ ఉత్తర కొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే వైఖరితో ముందుకెళితే, మీ దేశం కనుమరుగవుతుందని హెచ్చరించారు. మీ దగ్గరున్న ఆయుధాలు మిమ్మల్ని ఎంతమాత్రం కాపాడలేవని అన్నారు. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మిమ్మల్ని క్రమేపీ చీకట్లోకి నెట్టివేస్తున్నాయని తెలిపారు. మీ తాత కలలుకన్న విధంగా ఉత్తర […]


 • ప్రధానులూ పదవీచ్యుతులయ్యారు

  పనామా పత్రాల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల పేర్లు బట్టబయలు పలు దేశాల్లో నేటికీ కొనసాగుతున్న విచారణ.. రెండేళ్ల క్రితం పనామా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. నాటి పత్రాల దెబ్బకు ఏకంగా ఇద్దరు ప్రధానులూ పదవీచ్యుతులయ్యారు. అనేక సంస్థలు మూతపడ్డాయి. కొందరు ప్రముఖులు, సంస్థలపై ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ప్యారడైజ్‌ పత్రాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మరోసారి పనామా పత్రాల వ్యవహారం అందరికీ గుర్తుకొస్తోంది. మనదేశంలోనూ కుదుపు […]


 • న్యూయార్క్ లో మరో ఉగ్రదాడి..

  ట్రక్కుతో బీభత్సం సృష్టించిన దుండగుడు.. ఎనిమిది మంది మృతి! అమెరికాలోని న్యూయార్క్‌లో డబ్ల్యూటీసీ వద్ద ఓ దుండగుడు ట్రక్కుతో బీభత్సం సృష్టించాడు. లోయర్‌ మాన్‌హట్టన్‌ ప్రాంతంలో 29 ఏళ్ల ముష్కరుడు ట్రక్కును నడుపుతూ ఒక్కసారిగా సైకిళ్లు వెళ్లే మార్గంలోకి మళ్లించాడు. వేగంగా జనంపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న భధ్రతాసిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్‌పై కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి […]


 • చర్యలు తీసుకుంటారా.. మమ్మల్నే స్పందించమంటారా?

  ఉగ్రవాద మూకలపై చర్యలు తీసుకొని, వారి సురక్షిత స్థావరాలను ధ్వంసం చేయాలని పాకిస్థాన్‌కు అమెరికా శాఖ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌ స్పష్టంచేశారు. లేకుంటే తామే ఆ లక్ష్యాన్ని సాధిస్తామని తేల్చిచెప్పారు. టిల్లర్‌సన్‌ ఇటీవల పాకిస్థాన్‌ను సందర్శించారు. ఆ సందర్భంలో పాక్‌ నాయకత్వానికి విస్పష్ట సందేశం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తన భౌగోళిక పరిధిలో ఉన్న ఉగ్రవాద ముఠాలన్నింటిపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని పాక్‌కు అనేకసార్లు స్పష్టంచేసినట్లు గుర్తుచేశారు. తమ ఆకాంక్షలను విస్పష్టంగా, నిర్మొహమాటంగా తేల్చిచెప్పినట్లు వివరించారు. ‘‘ఈ […]


 • శక్తిమంతమైన నేతగా షి జిన్‌పింగ్‌

  చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీ తమ దేశ ప్రస్తుత అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ను మరో అయిదేళ్ల పాటు అదే పదవిలో కొనసాగించేందుకు నిర్ణయించటంతో పాటు ఆయనకు అరుదైన గౌరవాన్ని కల్పించింది. పార్టీ వ్యవస్థాపకుడు, ఆధునిక చైనా రూపకర్త మావో జెడాంగ్‌తో సమానమైన హోదాను కల్పించింది. పార్టీ రాజ్యాంగంలో ఇప్పటి వరకూ మావో, ఆయన తర్వాత అధికారాన్ని చేపట్టిన డెంగ్‌ జియావోపింగ్‌ల పేర్లు, సిద్ధాంతాలు, ఆలోచనలనే చేర్చారు. డెంగ్‌ ఆలోచనలకు ఆయన మరణం తర్వాతే పార్టీ రాజ్యాంగంలో చోటుదక్కింది. […]


 • షింజో అబే ఘన విజయం

  జపాన్‌ ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని షింజో అబే ఘన విజయం సాధించారు. 465 మంది సభ్యులు ఉన్న దిగువ సభలో ఆయన ఆధ్వర్యంలోని లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఆ పార్టీకి 281 సీట్లు రాగా, మిత్రపక్షం కొమెటోకు 29 వచ్చాయి. కొమెటో మద్దతు లేకుండానే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కలిగింది. రెండింటికి కలిపి 310 స్థానాలు లభించడంతో దాదాపుగా మూడింట రెండింతల ఆధిక్యం వచ్చినట్టయింది. అబే నాలుగో […]