Articles Posted in the " Telangana " Category

 • ప్రేమాంతకురాలు

  కోరి పెళ్లాడిన వ్యక్తినే చంపేసింది వివాహేతర సంబంధానికి అడ్డొస్తాడని.. ప్రియుడితో కలిసి ఘాతుకం అతణ్ని భర్తగా చూపించేందుకు యాసిడ్‌ దాడి నాటకం కటకటాలపాలైన స్వాతి వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుని ఏడేళ్లుగా కలిసి బతుకుతున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల పాప ఉన్నారు. అయితే భర్త వ్యాపార పనుల్లో పడి తనను పట్టించుకోవడం లేదన్న చిన్న అసంతృప్తితో ఆమె చక్కటి సంసారంలో నిప్పులు పోసుకుంది. అడ్డదారి తొక్కి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం […]


 • కేంద్రం భరోసా

  15 రోజులకోసారి పోలవరానికి వస్తానన్న గడ్కరీ పని ఆపొద్దని ప్రస్తుత గుత్తేదారులకు ఆదేశం కొత్త టెండర్లపై సీఎంతో మాట్లాడి నిర్ణయం గుత్తేదారుకు ఆర్థిక వెసులుబాటుపై త్రిసభ్య కమిటీ తక్షణ నివేదిక 22న కేంద్ర మంత్రి రాక పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018 కల్లా నీళ్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం ఇక పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి తాను వచ్చి స్వయంగా పనుల ప్రగతిని పరిశీలిస్తానని కేంద్ర మంత్రి నితిన్‌ […]


 • 28నే మెట్రో

  ప్రధాని పర్యటన ఖరారు… మియాపూర్‌లో ప్రారంభం అక్కడి నుంచి కూకట్‌పల్లికి రైలులో రాకపోకలు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా అందిన సమాచారం ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది. ఈనెల 28న, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆయనతో వస్తారు. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర ప్రముఖులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. పరిచయాల అనంతరం 3.25కి వారంతా మియాపూర్‌ […]


 • ఇవాంకా రాక నేపథ్యంలో.. భారత పోలీసుల వద్ద తుపాకులే వుండకూడదంటూ అమెరికా సీక్రెట్ సర్వీస్ ఆదేశాలు!

  వచ్చే వారంలో హైదరాబాద్ రానున్న ట్రంప్ కుమార్తె గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సుకు హాజరు ప్రధాని మోదీతో కలసి పాల్గొననున్న ఇవాంకా యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారుల ఆంక్షలు వచ్చే వారంలో హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరు కానుండగా, ఆమె భద్రతకు సంబంధించి అమెరికా సీక్రెట్ సర్వీస్ రంగంలోకి దిగింది. ఆమెకు భద్రతగా ఉండే ఇండియన్ పోలీసులు ఎవరి […]


 • సిమెంటు రోడ్డుపై పరుగులు

  తెలంగాణలో రెండు మార్గాల్లో ప్రయోగం నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా దీర్ఘకాలిక మన్నిక కోసమే.. తెలంగాణలో సిమెంట్‌ మార్గాల దిశగా అడుగులు పడ్డాయి. దీర్ఘకాలిక మన్నిక కోసం తొలిసారిగా రాష్ట్రంలోని రెండు మార్గాలను సిమెంటుతో నిర్మించేందుకు కేంద్రం ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రద్దీగా ఉండే మార్గాలను తొలిదశలో ఎంచుకున్నారు. తారుతో పోలిస్తే సిమెంటు రోడ్ల నిర్మాణ వ్యయం ఒకింత ఎక్కువైనా రహదారి మన్నిక గణనీయంగా ఉండటంతో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. 2019 చివరి నాటికి ఈ రెండు మార్గాలు […]


 • సాగునీరు పుష్కలం

  యాసంగిలో 24 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రణాళిక యాసంగిలో సాగునీటి ప్రాజెక్టుల కింద అత్యధిక ఆయకట్టు సాగులోకి రానుంది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధి కలిపి సుమారు 24 లక్షల ఎకరాలకు నీరందించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్ణయించింది. సెప్టెంబరు రెండో వారం వరకు వర్షాలు లేకపోవడంతో రైతులు ఖరీఫ్‌ను కోల్పోయారు. ఆనెలాఖరు నుంచి అక్టోబరు చివరి వరకు అన్ని జలాశయాలలోకి ప్రవాహం రావడం, నిల్వ సామర్థ్యం పెరగడంతో యాసంగి (రబీ)లో వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీటిని […]


 • 40 కొత్త పురపాలికలు

  ప్రస్తుతం ఉన్నవాటిలో మరిన్ని గ్రామాల విలీనం ఆయా పంచాయతీల తీర్మానాలు తీసుకోవాలి కలెక్టర్లతో వీసీలో మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలో కొత్తగా మరో 40 పురపాలక సంఘాలు ఏర్పాటు కానున్నాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే, 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా 15 వేలకు మించి జనాభా ఉన్న మేజర్‌ గ్రామపంచాయతీలు పురపాలక సంఘాలుగా మారుతాయన్నారు. ప్రస్తుతం ఉన్న పురపాలక సంఘాల పరిధిని విస్తరించేందుకు మూడు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను […]


 • ఆటోస్టార్టర్లు తొలగించాలి

  విద్యుత్తు ఆదా కోసం కాదు.. భూగర్భ జలాలు కాపాడేందుకే పంపిణీ, సరఫరా వ్యవస్థల బలోపేతానికి రూ.42 వేల కోట్లు తెలంగాణను విద్యుత్తు మిగులు రాష్ట్రంగా మార్చటమే లక్ష్యం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన ‘వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరాను ప్రారంభించాం. దశాబ్దాలుగా కరెంటు కష్టాలు అనుభవించిన రైతులకు ఇది తీపి కబురు. వ్యవసాయ మోటార్లకు అమర్చిన ఆటోస్టార్టర్లను రైతులు తొలగించాలి. విద్యుత్తును ఆదా చేసేందుకు ఇలా కోరటం లేదు. భూగర్భ జలాల్ని కాపాడుకునేందుకే వీటి తొలగింపు అనివార్యమని విన్నవిస్తున్నా’ […]


 • ఎమ్మెల్యేగా గెలవలేకపోతే తెలంగాణలో తిరగలేను: కోమటిరెడ్డి

  అసెంబ్లీకే పోటీపడతాను పార్లమెంట్ కు వెళ్లే ఉద్దేశం లేదు భూపాల్ కు అంత సీన్ లేదు నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి మరో ఏడాదిన్నరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా తాను గెలవలేకపోతే, తెలంగాణ రాష్ట్రంలో తిరగలేనని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, లాబీల్లో తనను కలిసిన మీడియాతో ముచ్చటించారు. వచ్చే ఎన్నికల్లోనూ తాను ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తానని, ఎంపీగా పోటీ చేసి […]


 • అందరి చరిత్రలూ సభలో పెడదాం

  ఏ పార్టీ వారు భూకబ్జాలకు పాల్పడ్డారో తెలుసు సభాసంఘం త్వరలో తేల్చబోతోంది ఉత్తమకుమార్‌రెడ్డి తండ్రి అమ్మిన భూమికీ పట్టా ఇచ్చాం శాసనసభలో సీఎం కేసీఆర్‌ ‘ఏ పార్టీ వారు భూ కబ్జాలకు పాల్పడ్డారనేది తెలుసు. అసైన్డ్‌ భూములపై సభాసంఘం త్వరలో తేల్చబోతోంది. అందరి చరిత్రలూ సభలో పెడదాం’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘భూ దస్త్రాల ప్రక్షాళన’ అంశంపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చలో కాంగ్రెస్‌ సభ్యుడు భట్టివిక్రమార్క మాట్లాడుతూ పేదల నుంచి అసైన్డ్‌ భూములు ప్రభుత్వం […]