pakistan,kabaddi,world cup,India

ఇండియాను ఓడించారట… ఇమ్రాన్ ట్వీట్ పై ‘మా జట్టు ఎప్పుడు వచ్చింది?’ అంటూ తిట్ల దండకం!

సామాజిక మాధ్యమాల సాక్షిగా, ఇమ్రాన్ ఖాన్ మరోసారి విమర్శల పాలయ్యారు. “కబడ్డి ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ను ఓడించి, కప్పు గెలిచిన పాకిస్తాన్ జట్టుకు శుభాకాంక్షలు” అంటూ ఆయన ఓ ట్వీట్ చేయగా, భారత్ నుంచి కబడ్డీ జట్టు పాకిస్థాన్ కు ఎప్పుడు వచ్చిందని నెటిజన్లు తిట్ల దండకాన్ని అందుకున్నారు. ఇక్కడి నుంచి అధికారికంగా ఏ జట్టూ వెళ్లకపోయినా, ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియాపై 43-41 తేడాతో పాక్ గెలిచిందని అక్కడి పత్రికలు రాశాయి. తమ జట్టుకు ప్రధాని ఇమ్రాన్ శుభాకాంక్షలు కూడా తెలిపారు.

ఇక పాక్ లో నిర్వహిస్తున్న సర్కిల్ కబడ్డీ వరల్డ్ కప్ కు తాము ఎటువంటి జట్టునూ పంపలేదని ఏకేఎఫ్‌ఐ (అమెచ్యూర్ కబడ్డి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) స్పష్టం చేసింది. ఈ మేరకు పాక్ బోర్డుకు ముందే లేఖ రాసి, అదే విషయాన్ని ఐఓఏ (ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్)కు కూడా తెలిపింది.

ఇదిలావుండగా, కొందరు పంజాబ్ ఆటగాళ్లు సర్కిల్ కబడ్డీని ఎక్కువగా ఆడుతుంటారు. వారిలో కొందరు అనుమతులు లేకుండా పాక్ కు వెళ్లి ఈ పోటీల్లో పాల్గొన్నారని కొందరు ఆరోపిస్తున్నారు.
Tags: pakistan,kabaddi,world cup,India

ms dhoni,puttaparthi,sathya sai baba

పుట్టపర్తిలో ధోనీ.. చూసేందుకు ఎగబడిన అభిమానులు

  • సత్యసాయి సమాధిని దర్శించుకున్న ధోనీ
  • ధ్యాన మందిరంలో 20 నిమిషాల పాటు ధ్యానం
  • ధోనీకి సేవా కార్యక్రమాల గురించి వివరించిన రత్నాకర్

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పుట్టపర్తిలో సత్య సాయిబాబా మహాసమాధిని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దర్శించుకున్నాడు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి ధోనీ వచ్చాడు. విమనాశ్రయం నుంచి ప్రశాంతి నిలయానికి చేరుకున్న ధోనీకి ట్రస్టు సభ్యులు రత్నాకర్ ఘన స్వాగతం పలికారు. అనంతంర సాయి కుల్వంత్ సభామందిరంలో ఉన్న సత్యసాయి మహాసమాధి వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి దర్శించుకున్నారు. ఆ తర్వాత బాబా ధ్యాన మందిరంలో 20 నిమిషాల పాటు ధ్యానం చేశారు.

తన పర్యటనలో భాగంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ధోనీ సందర్శించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సేవా కార్యక్రమాల గురించి ధోనీకి రత్నాకర్ వివరించారు. అనంతరం ధోనీ మాట్లాడుతూ, బాబా సేవలు అద్భుతమని చెప్పారు. సత్యసాయి ప్రపంచానికే ఆదర్శమని, ట్రస్టు సేవలను మరింత విస్తృతం చేయాలని కోరారు. మరోవైపు, ధోనీ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.

Tags: ms dhoni,puttaparthi,sathya sai baba

Narendra Modi,Lakshman,Saina Nehwal,BJP national, politics

దటీజ్ మోదీ చరిష్మా.. అందుకే మా పార్టీలో చేరుతున్నారు: బీజేపీ నేత లక్ష్మణ్

భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ప్రముఖులు, సెలబ్రిటీలు క్యూ కడుతున్నారని, ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న చరిష్మా, ఆయన పనితీరు కారణంగానే సైనా నెహ్వాల్ వంటి వారు పార్టీలో చేరుతున్నారని అన్నారు. తాజాగా జాతీయ వార్తా సంస్థ ‘పీటీఐ’తో మాట్లాడిన ఆయన, బ్యాడ్మింటన్ లో అసమాన ప్రతిభను చూపిన సైనా నెహ్వాల్ చేరిక, బీజేపీకి బలాన్ని చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఆమె వంటి క్రీడాకారులకు బీజేపీ వంటి జాతీయ పార్టీయే సరైన వేదికని అన్నారు. బీజేపీలో చేరి ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉందని అన్నారు.
Tags: Narendra Modi,Lakshman,Saina Nehwal,BJP national, politics

PV Sindhu, Badminton, Chinese Open, world tour super 750 torny

చైనా ఓపెన్… అనామకురాలి చేతిలో పీవీ సింధుకు ఘోర పరాభవం!

  • తొలి రౌండ్ లోనే పరాజయం
  • సింధును ఓడించిన పాయ్ యు
  • వరుస తప్పులు చేసిన సింధు

గత కొంతకాలంగా బ్యాడ్మింటన్ పోటీల్లో వరుసగా వైఫల్యం చెందుతున్న తెలుగుతేజం పీవీ సింధు… మరోసారి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో ఓ అనామకురాలి చేతిలో తొలి రౌండ్ లోనే ఓటమి పాలైంది. ఈ టోర్నీలో ఆరో సీడ్ గా బరిలోకి దిగిన సింధును, బ్యాడ్మింటన్ ప్రపంచంలో పెద్దగా పరిచయం లేని చైనీస్ తైపీకి చెందిన క్రీడాకారిణి, 42వ ర్యాంక్ తో బరిలోకి దిగిన పాయ్ యు ఓడించింది.

తొలి రౌండ్ మ్యాచ్ లో 13-21, 21-18, 19-21 తేడాతో సింధును పాయ్ మట్టి కరిపించింది. తొలి సెట్ ను పాయ్ గెలుచుకున్నా, ఆపై పుంజుకున్న సింధూ, రెండో సెట్ ను గెలుచుకుంది. నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో సింధూ చేతులెత్తేయడంతో ఈ టోర్నీ నుంచి ఆమె వెనుదిరిగింది. దాదాపు గంటంబావు పాటు మ్యాచ్ సాగింది. మూడో సెట్ లో 15-12 ఆధిక్యంలో ఉన్న సింధు, ఆపై మరింత ఆధిక్యంలోకి దూసుకెళ్లినా, వరుసగా తప్పులు చేసి ఓటమి చవిచూసింది.
Tags: PV Sindhu, Badminton, Chinese Open, world tour super 750 torny

విజయవాడలో ఉద్రిక్తతక

వైసీపీ నేత గౌతం రెడ్డి వ్యాఖ్యలు విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాయి. వంగవీటి రంగా హత్యను ఆయన సమర్థిస్తూ ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయవాడ భగ్గుమనడానికి కారణమయ్యాయి. చివరికి రాధా, ఆయన తల్లి రత్నకుమారి అరెస్ట్‌కు దారి తీశాయి. ఇంతకీ గౌతం రెడ్డి ఏమన్నారంటే..

వంగవీటి రంగా, రాధలను చంపడం దారుణమని ఎందుకంటారని, రౌడీ రాజకీయాలే పరమావధిగా ముందుకెళ్లే వారు పోస్టుమార్టానికి వెళ్లాల్సిందేనని గౌతంరెడ్డి అన్నారు. ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఓ కథ కూడా చెప్పారు. ఓసారి ఓ పాము కనిపించిన వారినందరినీ కాటువేసుకుంటూ వెళ్తూ చివరికి ఓ దేవుడి ఫొటో వెనక దాక్కుందని, కానీ తమను కాటువేసిన పాము దేవుడి ఫొటో వెనక దాక్కుంది కదా.. అని జనాలు చంపడం మానేస్తారా? అని ప్రశ్నించారు.

నిరాహార దీక్షలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా రౌడీ రాజకీయాలు చేసే వారి భవిష్యత్ పోస్టుమార్టమేనంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. రౌడీ రాజకీయాలు వదిలి తమలాగా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వాళ్లు వచ్చిన తర్వాతే కుల రాజకీయాలు బయటకు వచ్చాయని ఆరోపించారు. వారు ఈ కులం వారిని చంపితే, వారు ఈ కులం వారిని చంపడం మొదలుపెట్టారని గౌతం రెడ్డి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

కాకినాడలో ఊహించిన ఫలితమే.!

ఉప ఎన్నికలైనా, స్థానిక ఎన్నికలైనా అధికార పార్టీకి వుండే ‘ఎడ్జ్‌’ ప్రత్యేకం. మొన్న నంద్యాల ఉప ఎన్నిక ఫలితమైనా, నేడు కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నిక ఫలితమైనా.. అధికార పార్టీకి వ్యతిరేకంగా వస్తే, అదో సెన్సేషన్‌. ప్రతిపక్షం వెనుకబడటం అనేది సాధారణమైన వార్తే. ఎట్‌ ది సేమ్‌ టైమ్‌ అధికార పార్టీ విజయం సాధించడమూ సాధారణమైన వార్తగానే భావించాలేమో.!

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి మెజార్టీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేస్తోంది. ప్రతిపక్షం వైఎస్సార్సీపీ పెద్దగా అధికార పార్టీకి పోటీ ఇచ్చినట్లు కన్పించడంలేదు. అయితే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరుడి తనయుడ్ని ఓడించడంలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం సాధించడం గమనార్హమిక్కడ.

సదరు ఎమ్మెల్యే మొత్తంగా తన బలాన్నంతా 22వ డివిజన్‌ మీద ఫోకస్‌ పెట్టినా ప్రయోజనం లేకుండాపోయింది. టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు సోదరుడి కుమారుడు శివకుమార్‌పై, వైఎస్సార్సీపీ అభ్యర్థి కిషోర్‌ ఘనవిజయాన్ని అందుకున్నారు. మరో డివిజన్‌నీ కైవసం చేసుకుంది వైఎస్సార్సీపీ. టీడీపీ 13కి పైగా డివిజన్లలో విజయం సాధించింది. ఇది ఉదయం 10 గంటల నాటి పరిస్థితి. మరో 2 గంటల్లోనే పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

మొత్తంగా ఫలితాలు ఇందుకు భిన్నంగా వుండే అవకాశాలైతే లేవు. మెజార్టీ స్థానాలు టీడీపీ – బీజేపీ కూటమి కైవసం చేసుకోనుండడంతో కాకినాడ మేయర్‌ పదవి తెలుగుదేశం పార్టీ వశం కావడం లాంఛనమే కావొచ్చు.

రేపు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ..

8మంది ఔట్.. ఏపీ నుంచి హరిబాబుకు చోటు?
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సర్వం సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే శనివారమే కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇందులో భాగంగా ఎన్డీయేలోకి ఇటీవల వచ్చి చేరిన జేడీయూకు కేబినెట్‌లో స్థానం కల్పించనుండగా, అన్నాడీఎంకే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇక ప్రస్తుత మంత్రుల్లో 8 మందిపై కత్తివేలాడుతుండగా, మరో 8 మంది శాఖలు మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు రాజీవ్ ప్రతాప్ రూడీ, సంజీవ్ బల్యాన్, ఉమాభారతి, ఫగన్ సింగ్ కులస్తే, గిరిరాజ్ సింగ్ రాజీనామా చేయగా వీరిలో రాజీవ్ రూడీ, సంజీవ్ బల్యాన్ రాజీనామాలను ఆమోదించారు. ఉమాభారతి అనారోగ్య కారణాలతో రాజీనామా సమర్పించారు.

ఇక పదవి కోల్పోనున్న వారిలో నిర్మలా సీతారామన్, కల్రాజ్ మిశ్రా ఉన్నట్టు తెలుస్తోంది. నితిన్ గడ్కరీకి రైల్వే శాఖ అప్పగించనున్నట్టు తెలుస్తుండగా, సీతారామన్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పౌర విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతిరాజు శాఖ మారిపోనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆర్థిక, రక్షణ శాఖల బాధ్యతలు మోస్తున్న అరుణ్ జైట్లీకి రక్షణ శాఖను పూర్తిస్థాయిలో అప్పగించి ఆర్థిక శాఖను పీయూష్‌కు అప్పగించే యోచనలో ఉన్నారు. ఏపీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబుకు కేబినెట్‌లో చోటు ఖాయంగా కనిపిస్తోంది.

2019 కల్లా స్విస్ నల్లకుబేరుల జాబితా ఇస్తాం: స్విస్ అధ్యక్షురాలి హామీ

 

నల్లకుబేరుల వివరాల తొలి జాబితాను 2019 కల్లా అందజేస్తామని స్విట్జర్లాండ్‌ అధ్యక్షురాలు డోరిస్‌ ల్యూథర్డ్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆమె ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిపిన విస్తృత చర్చల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలు, పన్ను ఎగవేత, నల్లధనాన్ని వెలికితీసేందుకు సహకారంపై అవగాహనకు వచ్చారు. ఈ సందర్భంగా అణు ఇంధన సరఫరా దేశాల గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ) లో, క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్‌) లో సభ్యత్వానికి మద్దతు తెలపడంపై ఆమెకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. పన్ను ఎగవేత సమాచార ఆటోమేటిక్ మార్పిడి చట్టాన్ని ఈ ఏడాది చివరికంతా పార్లమెంటు ఆమోదిస్తుందని ఆమెకు హామీ ఇచ్చారు. రైల్వే రంగంలో సహకారానికి రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నామని మీడియా సమావేశంలో తెలిపారు.

నా మనవడు నా పేరే మర్చిపోయాడు: నటుడు బాలకృష్ణ

తన మనవడు చిన్నారి దేవాన్ష్ తన పేరే మర్చిపోయాడని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మనవడు దేవాన్ష్ ను ‘నా పేరేంటిరా? అని అడిగితే..‘శాతకర్ణి’ అని, లేకపోతే ‘గోల తాత’ అంటాడు’ అని చెబుతూ బాలయ్య నవ్వులు చిందించారు.

బాలయ్య తన అభిమానిపై చేయిచేసుకున్న సందర్భాన్ని ప్రస్తావించగా, ‘నా చేయి తగలడం అభిమానులు ప్రేమగా భావిస్తారు. అతిగా చేస్తే తప్పా, నేను చేయి చేసుకోను. నా అభిమానులకు నాకు మధ్య ఎవరైనా వస్తే దబిడిదిబిడే’ అని చెప్పుకొచ్చారు. కాగా, దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘పైసా వసూల్’ చిత్రం రేపు విడుదల కానుంది.