Articles Posted in the " Crime " Category

 • ప్రేమాంతకురాలు

  కోరి పెళ్లాడిన వ్యక్తినే చంపేసింది వివాహేతర సంబంధానికి అడ్డొస్తాడని.. ప్రియుడితో కలిసి ఘాతుకం అతణ్ని భర్తగా చూపించేందుకు యాసిడ్‌ దాడి నాటకం కటకటాలపాలైన స్వాతి వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుని ఏడేళ్లుగా కలిసి బతుకుతున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల పాప ఉన్నారు. అయితే భర్త వ్యాపార పనుల్లో పడి తనను పట్టించుకోవడం లేదన్న చిన్న అసంతృప్తితో ఆమె చక్కటి సంసారంలో నిప్పులు పోసుకుంది. అడ్డదారి తొక్కి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం […]


 • శశికళ ఆస్తులు రూ. 5 లక్షల కోట్లు.. ఐటీ దాడుల్లో బయటపడిన కళ్లు చెదిరే వాస్తవం!

  శశికళ బంధుగణంపై మరోమారు దాడులకు సిద్ధమవుతున్న ఐటీ దేశవ్యాప్తంగా ఆస్తులు కూడబెట్టుకున్న శశికళ 240 బ్యాంకు లాకర్లు గుర్తింపు జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. శశికళ, ఆమె కుటుంబ సభ్యులు, బినామీలు, అనుచరగణంపై ఇటీవల దాడిచేసిన ఐటీ అధికారులు తాజాగా మరోమారు దాడులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల విలువైన స్థిరాస్తులను గుర్తించిన ఐటీ మరోమారు దాడులకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. శశికళ, ఆమె […]


 • అధ్యక్షుడిపై తిరుగుబాటు చేయలేదు

  జింబాబ్వే సైన్యం అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిందన్న వార్తలు తాజాగా కలకలం రేపుతున్నాయి. అయితే సైన్యం దీనిపై వివరణ ఇచ్చింది. తాము ఎలాంటి తిరుగుబాటుకు ప్రయత్నించలేదని బుధవారం ఉదయం అక్కడి అధికారిక మీడియాలో సైన్యం వెల్లడించింది. అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే చుట్టు ఉన్న క్రిమినల్స్‌ను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్‌ చేపడుతున్నామని వివరించింది. ఈ చర్యతో ప్రభుత్వాన్ని సైన్యం చేతుల్లోకి తీసుకున్నట్టు కాదని ఆర్మీ జనరల్‌ ఒకరు తెలిపారు. ‘అధ్యక్షుడు ముగాబే, ఆయన కుటుంబం క్షేమంగా ఉంది.. వారి […]


 • రాందేవ్ బాబా గెలుపు వెనక భయంకరమైన చీకటి కోణాలు..

  సంచలన విషయాలు బయటపెట్టిన జర్నలిస్ట్ ప్రియాంకా పాఠక్! సంచలనం సృష్టిస్తున్న ‘గాడ్‌మ్యాన్ టు టైకూన్’ రాందేవ్ బాబా జీవితంలోని చీకటి కోణాలు బయటపెట్టిన ప్రియాంక పుస్తకంపై నిషేధం కోరుతూ కోర్టును ఆశ్రయించిన రాందేవ్ బాబా పుస్తకంపై స్టే.. న్యాయపోరాటం చేస్తామన్న ప్రచురణ సంస్థ రాందేవ్ బాబా.. ఇప్పుడీ పేరే సంచలనం. దేశంలోని ఏ మూల ఏ చిన్న కుర్రాడిని అడిగినా బాబా గురించి చెబుతాడు. యోగా గురువుగా జీవితాన్ని ప్రారంభించి నేడు వేల కోట్ల రూపాయల విలువైన […]


 • ప్రధానులూ పదవీచ్యుతులయ్యారు

  పనామా పత్రాల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల పేర్లు బట్టబయలు పలు దేశాల్లో నేటికీ కొనసాగుతున్న విచారణ.. రెండేళ్ల క్రితం పనామా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. నాటి పత్రాల దెబ్బకు ఏకంగా ఇద్దరు ప్రధానులూ పదవీచ్యుతులయ్యారు. అనేక సంస్థలు మూతపడ్డాయి. కొందరు ప్రముఖులు, సంస్థలపై ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ప్యారడైజ్‌ పత్రాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మరోసారి పనామా పత్రాల వ్యవహారం అందరికీ గుర్తుకొస్తోంది. మనదేశంలోనూ కుదుపు […]


 • 29కి పెరిగిన మృతుల సంఖ్య

  ఉత్తర్‌ప్రదేశ్‌, రాయ్‌బరేలీ జిల్లా వూంచాహార్‌లోని జాతీయ థర్మల్‌ విద్యుత్తు కేంద్రం(ఎన్టీపీసీ)లో బాయిలర్‌ పేలుడుతో మృతిచెందినవారి సంఖ్య 29కి పెరిగింది. ఈ ఘటనలో బుధవారమే 20 మంది దుర్మరణం పాలవ్వగా.. చికిత్స పొందుతూ గురువారం మరో 9 మంది మరణించారని అధికార వర్గాలు తెలిపాయి. ఇంకా 85మంది చికిత్స పొందుతున్నారని తెలిపాయి. కేంద్రమంత్రి ఆర్‌.కె.సింగ్‌ ఘటనాస్థలాన్ని గురువారం సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.20లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.10లక్షలు, స్వల్పగాయాలైనవారికి రూ.2లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. ఈ ఘటనపై న్యాయవిచారణ […]


 • ఎన్నారై సంబంధాలా.. తొందరపడితే అగచాట్లే

  ఆరా తీశాకే.. అడుగేయండి.. సమగ్ర సమాచారంతో సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌ ‘‘బేగంపేటలో నివాసముంటున్న మహాలక్ష్మి (పేరు మార్చాం) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది.. ఆస్ట్రేలియాలో స్థిరపడిన వరంగల్‌ జిల్లా వాసి రమేష్‌ను పదకొండునెలల క్రితం పెళ్లి చేసుకుంది. పెళ్లప్పుడు కట్నంగా రూ.కోటి నగదు, రెండు కిలోల బంగారు ఆభరణాలు, హైదరాబాద్‌లో ఉంటున్న రమేష్‌ తల్లిదండ్రుల కోసం ఒక బెంజ్‌కారును మహాలక్ష్మి తల్లిదండ్రులు ఇచ్చారు. పెళ్లయ్యాక మహాలక్ష్మి ఆస్ట్రేలియా వెళ్లింది. కొద్దిరోజుల తర్వాత రమేష్‌ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. […]


 • రష్యాలోని బైకాల్‌ సరస్సులో 130 సీల్‌ చేపలు మృత్యువాత

  ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన రష్యాలోని బైకాల్‌ సరస్సులో 130 సీల్‌ చేపలు మృత్యువాత పడ్డాయి. ప్రపంచంలోనే అతి లోతైన సరస్సుగా పేర్గాంచిన బైకాల్‌లో ఇటీవల చేపలు, ఇతర జీవులు గుంపులుగా చనిపోతున్నాయి. ఇటీవల పర్యటకుల సంఖ్య పెరగడంతో కాలుష్యం పెరిగిపోయిందన్న వాదనతో అధికారులు ఏకీభవించడం లేదు. ప్రాథమిక వైద్య పరీక్షలు చేసిన వైద్యులు గుండె కొట్టుకోవడం ఆగిపోవడం వల్లనే సీల్‌ చేపలు చనిపోయినట్లు నిర్ధారించారు. స్పైరోగైరా ఆల్గే పెరిగిపోవడం వల్లే సీల్స్‌ చనిపోతున్నాయని అనుమానిస్తున్నారు.


 • న్యూయార్క్ లో మరో ఉగ్రదాడి..

  ట్రక్కుతో బీభత్సం సృష్టించిన దుండగుడు.. ఎనిమిది మంది మృతి! అమెరికాలోని న్యూయార్క్‌లో డబ్ల్యూటీసీ వద్ద ఓ దుండగుడు ట్రక్కుతో బీభత్సం సృష్టించాడు. లోయర్‌ మాన్‌హట్టన్‌ ప్రాంతంలో 29 ఏళ్ల ముష్కరుడు ట్రక్కును నడుపుతూ ఒక్కసారిగా సైకిళ్లు వెళ్లే మార్గంలోకి మళ్లించాడు. వేగంగా జనంపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న భధ్రతాసిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్‌పై కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి […]


 • పింఛన్లపై పిశాచాలు!

  చనిపోయిన వారి పేరిట భారీగా స్వాహా ‘ఖజానా’ల్లో రూ.వంద కోట్ల కుంభకోణం ‘సీతమ్మధార’లోనే రూ. కోట్లు హాంఫట్‌ విశాఖ జిల్లాలో రూ.25 కోట్ల గోల్‌మాల్‌ తెనాలిలో రూ.2 కోట్ల మేర అక్రమాలు ఒంగోలులో రూ.40 లక్షల చెల్లింపులు డైరెక్టరేట్‌లో పెద్ద తలకాయలకూ వాటాలు ప్రభుత్వ ఖజానా కార్యాలయాల్లో అవినీతి పిశాచాలు పేట్రేగిపోతున్నాయి. చనిపోయిన పింఛనుదారుల పేరిట వారు బతికున్నట్లు దొంగపత్రాలు సృష్టించి నకిలీ పింఛన్లు పీక్కుతింటున్న వైనాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ కుంభకోణం విలువ రూ.100 […]