Bigg Boss telugu4, Tarun, Mangli

‘బిగ్ బాస్-4’కి వినిపిస్తున్న కొత్త పేర్లు!

టీవీ రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’ షోకు వున్న క్రేజే వేరు..
ఆ కాన్సెప్ట్ .. ఆ టాస్కులు.. ఆ మాటలు…ఆ డ్రామా … అంతా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దానికి తోడు ఓ పెద్ద ఫిలిం స్టార్ దానికి హోస్టుగా వుండడం మరింత ఆకర్షణీయం అవుతుంది. అందుకే దీనికి మంచి టీఆర్పీ కూడా వస్తుంది.

ఈ క్రమంలో ఇప్పటికి ఈ షో మూడు సీజన్లు పూర్తి చేసుకోగా, త్వరలో నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. ఇక ఇందులో పాల్గొనే పార్టిసిపేంట్స్ ఎవరన్న దానిపై గత కొన్ని రోజులుగా బోలెడు పేర్లు వినవస్తున్నాయి. తాజాగా మరికొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

గతంలో పలు సినిమాలలో నటించి, రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న తరుణ్ ఇందులో ఒక పార్టిసిపేంట్ గా ప్రత్యేక ఆకర్షణ కానున్నాడని అంటున్నారు. అలాగే, జానపద గీతాల గానంతో పేరుతెచ్చుకున్న మంగ్లీ కూడా పాల్గొంటుందని సమాచారం. ఇంకా టీవీ యాంకర్లు వర్షిణి, జాహ్నవి తదితరులతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎవరిని ఎంపిక చేశారనేది వెల్లడవుతుంది.

ఇక మొదట్లో షెడ్యూల్ ప్రకారం జూన్ నుంచి ప్రసారం చేయాలనుకున్న ఈ బిగ్ బాస్ 4 సీజన్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే మళ్లీ కొత్త షెడ్యూల్ ప్రకటిస్తారు.
Tags: Bigg Boss telugu4, Tarun, Mangli

Pavan Kalyan,Harish Shankar, Tollywood

అదంతా పుకారేనన్న హరీశ్ శంకర్

పవన్ కల్యాణ్ తో హరీశ్ మూవీ
మానస రాధాకృష్ణన్ హీరోయిన్ అంటూ టాక్
పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన హరీశ్ శంకర్
చాలాకాలం క్రితం పవన్ కథానాయకుడిగా దర్శకుడు హరీశ్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ సినిమాను తెరకెక్కించాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. మళ్లీ ఇంతకాలానికి పవన్ తో మరో సినిమా చేయనున్నామని ఇటీవల హరీశ్ శంకర్ స్పష్టం చేశాడు. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా మానస రాధాకృష్ణన్ అనే మలయాళ ముద్దుగుమ్మను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పటికే మలయాళ సినిమాలతో బిజీ అవుతున్న ఈ సుందరి, పవన్ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం కానుందని చెప్పుకున్నారు.

మలయాళ భామలు తెలుగు తెరపై తమ జోరు చూపుతున్న కారణంగా అంతా ఈ వార్త నిజమేనని అనుకున్నారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. ఇందులో ఎంతమాత్రం నిజం లేదనీ, ఈ వార్త కేవలం పుకారు మాత్రమేనని చెప్పాడు. తన సినిమాలకి సంబంధించిన వివరాలను తానే స్వయంగా తెలియజేస్తానని అన్నాడు. ఈ పుకారు ఎక్కడ పురుడు పోసుకుందో తెలియదుగానీ, హరీశ్ శంకర్ దానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ఇప్పుడు పవన్ సరసన కథానాయికగా ఛాన్స్ ఎవరికి దక్కుతుందోననేది ఆసక్తికరంగా మారింది.
Tags: Pavan Kalyan,Harish Shankar, Tollywood

Dil Raju, Second Marriage, First Selfie

శ్రీమతితో దిల్ రాజు తొలి సెల్ఫీ… వైరలో వైరల్!

ఆదివారం రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు
చూడచక్కని జంటంటూ నెటిజన్ల కామెంట్లు
సామాజిక మాధ్యమాల్లో తొలి సెల్ఫీ చక్కర్లు
గత ఆదివారం రాత్రి నిజామాబాద్ కు సమీపంలోని నర్సింగ్ పల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో రెండో వివాహం చేసుకున్న టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, తన భార్యతో తొలిసారిగా ఓ సెల్ఫీని దిగారు. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, ఇద్దరూ చూడచక్కని జంటగా ఉన్నారని నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు.

కాగా, దిల్ రాజు వివాహమాడిన యువతి ఎవరన్న విషయమై మాత్రం ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఆమె పేరు తేజస్విని అని, బ్రాహ్మణ యువతని కొందరు అంటుండగా, మరికొందరు ఆమె పేరు వైఘా రెడ్డి అని, దిల్ రాజు కుటుంబానికి దగ్గరి వ్యక్తేనని మరికొందరు అంటున్నారు. ఈ విషయంలో ఉన్న సస్పెన్స్ ను దిల్ రాజే తీర్చాలని కోరుతున్నారు.
Tags: Dil Raju, Second Marriage, First Selfie

Sivaji Raja,Heart Attack,Vijay Raja,Doctors,Tollywood

నటుడు శివాజీ రాజాకు స్టెంట్ వేయనున్న వైద్యులు

తెలుగు చిత్ర సీమలో హీరోగా రాణించి, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిన సీనియర్ నటుడు శివాజీ రాజాకు గుండెపోటు వచ్చిందన్న వార్త సినీ వర్గాల వారిని షాక్ కి గురిచేసింది. నిన్న రాత్రి ఇంట్లో ఉన్న ఆయనకు అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ రావడంతో కుటుంబీకులు ఆయనను బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన తనయుడు విజయ్ రాజా, తన తండ్రికి, వైద్యులు స్టెంట్ వేయాలని నిర్ణయించారని తెలిపారు.

ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారని తెలిపిన విజయ్ రాజా, ప్రస్తుతం ఆయన్ను అబ్జర్వేషన్‌లో ఉంచారని తెలిపారు. కాగా, శివాజీరాజాకు గుండెపోటు వచ్చి, ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఫోన్లు చేసి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకుని, తిరిగి ఇంటికి రావాలని అభిలషించారు.
Tags: Sivaji Raja,Heart Attack,Vijay Raja,Doctors,Tollywood

Ramana Gogula, Pawan Kalyan, Johnny, Release Day, Tollywood

డియర్ పవన్ కల్యాణ్” అంటూ చాన్నాళ్లకు తెరపైకి వచ్చిన రమణ గోగుల

పవన్ కల్యాణ్ తో తమ్ముడు, బద్రి, జానీ వంటి సినిమాలకు హిట్ సంగీతం అందించిన వెర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల చాన్నాళ్ల తర్వాత తెరపైకి వచ్చారు. చాన్నాళ్ల కిందటే టాలీవుడ్ నుంచి తప్పుకున్న రమణ గోగుల తాజాగా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. “డియర్ పవన్ కల్యాణ్, జానీ సినిమా కోసం మనం మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వహించి 17 ఏళ్లయిందంటే నమ్మలేకపోతున్నాను. ఏదో నిన్నో,మొన్నో కలిసినట్టుంది. జానీ తర్వాత మన ప్రస్థానం ఘనంగా సాగిందనే అనుకుంటున్నాను. జానీ రిలీజ్ డే సందర్భంగా శుభాభినందనలు” అంటూ రమణ గోగుల భావోద్వేగభరితంగా స్పందించారు.

రమణ గోగుల ఒక దశలో టాలీవుడ్ అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన తెలుగులో చివరిగా సంగీతం అందించిన చిత్రం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్. 2013 తర్వాత రమణ గోగుల చిత్రపరిశ్రమకు గుడ్ బై చెప్పారు. ఖరగ్ పూర్ ఐఐటీ నుంచి ఎంటెక్, లూసియానా స్టేట్ యూనివర్శిటీ నుంచి ఎంఎస్ (కంప్యూటర్ సైన్స్) చేసిన రమణ గోగుల ప్రస్తుతం తన సంస్థల కార్యకలాపాలు చూసుకుంటున్నారు.
Tags: Ramana Gogula, Pawan Kalyan, Johnny, Release Day, Tollywood
https://twitter.com/RamanaGogula/status/1253956374125404161/photo/1

Pawan Kalyan, Bandla Ganesh, Teenmaar, Tollywood, Janasena

పవన్ కల్యాణ్ కు హృదయపూర్వక పాదాభివందనం: బండ్ల గణేశ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే సినీ నిర్మాత బండ్ల గణేశ్ కు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ చిన్న అవకాశం వచ్చినా పవన్ పై తన అభిమానాన్ని ఆయన చాటుకుంటుంటారు. పవన్ హీరోగా ఆయన నిర్మించిన ‘తీన్ మార్’ చిత్రం విడుదలై 9 ఏళ్లు గడిచింది. దీంతో బండ్ల గణేష్ తన అనుభూతులను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తీన్ మార్’ చిత్రం’ తన జీవితంలో ఓ ప్రత్యేకమైనది. ఈ చిత్రం విజయం సాధించకపోయినప్పటికీ… తనకు ఓ అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. కాశీ, మైసూర్, దక్షిణాఫ్రికా, అమెరికా, థాయ్ లాండ్ సహా మరెన్నో అద్భుతమైన లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని నిర్మించాము. హృదయానికి హత్తుకునే ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి. ఉదాహరణకు ‘అందంగా లేదని అమ్మను, కోపంగా ఉన్నాడని నాన్నను వదలలేవు కదా’ అనే డైలాగ్.

ఈ చిత్రానికి మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈరోజు ఈ సినిమా సాంగ్స్ విన్నా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఉదాహరణకు ‘వయ్యారాల జాబిల్లి’ సాంగ్. అర్జున్ పాల్వాయ్ గా, వేలాయుధంగా మా బాస్ అద్భుతంగా నటించారు. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం విజయం సాధించలేకపోయినప్పటికీ… త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని నాకు ఇచ్చిన నా దైవ సమానులైన పవన్ కల్యాణ్ గారికి ఇంకొక్కసారి హృదయపూర్వక పాదాభివందనం. ఇక నుంచి నన్ను ప్రేమించే వాళ్లని నేను ప్రేమిస్తా. నన్ను ఒక్క శాతం ప్రేమిస్తే… నేను 100 శాతం ప్రేమిస్తా. నా ప్రేమ వన్ సైడ్ లో ఉండదు.

అందరికీ ఇంకొక్క సారి చెప్పేదేంటంటే… నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఎవరి రాజకీయాలతో నాకు అవసరం లేదు. ఎవరు మంచి చేసినా… వారిని మెచ్చుకుంటా. కరోనా వంటి మహమ్మారిని చూసిన తర్వాత కూడా మనం నిజాయతీగా ఉండకపోతే మన జన్మ వ్యర్థమని నమ్ముతున్నా. ప్రేమిస్తే ప్రాణం ఇస్తా. ప్రేమించకపోతే దూరంగా ఉంటా. నీ ప్రేమకు బానిసను’ అంటూ బండ్ల గణేశ్ వరుస ట్వీట్లు చేశారు.
Tags: Pawan Kalyan, Bandla Ganesh, Teenmaar, Tollywood, Janasena

Sukumar

జన్మభూమికి దర్శకుడు సుకుమార్‌ ఆపన్న హస్తం

  • తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షల విరాళం
  • సొంత గ్రామానికి రూ.5 లక్షల సాయం

రాజోలు: కన్నతల్లిని, జన్మభూమిని గౌరవించే వారు దైవంతో సమానం. కష్టాలలో ఉన్న ప్రజలకు మానవతా దృక్పథంతో సాయం చేయడం మహనీయతకు నిదర్శనం. ఎంత ఎత్తుకు ఎదిగినా నిరాడంబరంగా కనిపించే ప్రముఖ సినీ దర్శకులు సుకుమార్ కరోనా మహమ్మారి కబళిస్తున్న వేళ ఆపన్నులకు సహాయ హస్తం అందించారు. ప్రార్దించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.
కరోనా వైరస్‌ మహమ్మారితో స్వీయ నిర్భంధంలో ఉన్న తన స్వగ్రామంలోని ప్రజలు ఉపాధి లేక అల్లాడుతున్న నేపథ్యంలో ప్రముఖ సినీ దర్శకులు బండ్రెడ్డి సుకుమార్‌ తన స్వగ్రామం మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి తన వంతు సహాయంగా 5 లక్షల రూపాయలను అందజేశారు. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు బండ్రెడ్డి సుకుమార్‌ రూ.10 లక్షలను కరోనా కట్టడికిగాను విరాళంగా ఇచ్చారు.

ఈ సందర్భంగా బండ్రెడ్డి సుకుమార్‌ మాట్లాడుతూ తనని చూసి మరికొందరు ముందుకు వస్తారని, కాలం కలిసొస్తే మళ్లీ సంపాదించుకుంటాననీ గర్వంగా చెప్పారు. తన మిత్రులకే కాదు, శత్రువులకు కూడా ఇలాంటి కష్టం రావొద్దని కోరుకుంటున్నానన్నారు. డబ్బులు ఉండి ఏం జేస్తయి.. సార్‌ పనికొస్తయా? మనం చచ్చిపోతే.. డబ్బులు ఏం జేస్తరు.. నాలాంటోళ్లు ఇంకా ఎందరో సాయం చేయడానికి ముందుకు రావాలని కోరుతూన్నా ” అని సుకుమార్‌ కోరారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రపంచంలో ఇప్పటికే 20 వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. భారత్‌లో 700 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 14 వరకు లాక్‌ డౌన్‌ విధించింది. ఈ నేపథ్యంలో తన గ్రామంలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుకుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ్రెడ్డి వెంకటేశ్వరరావు, బండ్రెడ్డి శ్రీను, కనుమూరి సత్తిబాబురాజు, కనుమూరి బాంబురాజు, కనుమూరి బుల్లికఅష్ణ ,బలిశెట్టి పెద్దిరాజు, జిల్లెళ్ళ విజయకుమార్‌, జిల్లెళ్ళ నరసింహారావు, మేకల ఏసుబాబు, విప్పర్తి చిట్టిబాబు, నేరుడుమెల్లి కృష్ణపతిరావు, తాడి సత్యనారాయణ, కాకర పండు ,కడలి సుబ్బిశెట్టి, స్టూడియో వర్మ గ్రామస్తులు పాల్గొన్నారు.

Pawan Kalyan,Ramcharan,Corona Virus,Donations,Tollywood

రామ్ చరణ్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నా: పవన్ కల్యాణ్

కరోనా వైరస్ పై పోరాటానికి సినీ పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. యంగ్ హీరో రామ్ చరణ్ తేజ్ రూ. 70 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయనిధులకు ఈ విరాళాన్ని ఇవ్వనున్నాడు. కరోనా కట్టడి కోసం ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు చేస్తున్న కృషి అమోఘమని కితాబిచ్చాడు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ స్ఫూర్తితో తాను ఈ విరాళాన్ని ఇస్తున్నానని చెప్పాడు.

సీఎంల సహాయనిధికి రామ్ చరణ్ విరాళాన్ని ప్రకటించడంపై జనసేనాని పవన్ కల్యాణ్ సంతోషాన్నివెలిబుచ్చారు. కరోనా మహమ్మారి కట్టడి కోసం రూ. 70 లక్షల విరాళాన్ని ప్రకటించిన చరణ్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధాని సహాయనిధికి రూ. 1 కోటి, టీఎస్ సీఎం సహాయనిధికి రూ. 50 లక్షలు, ఏపీ సీఎం సహాయనిధికి రూ. 50 లక్షల విరాళాన్ని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Tags: Pawan Kalyan,Ramcharan,Corona Virus,Donations,Tollywood

Chiranjeevi,Sridevi,Paruchuri Gopalakrishna,Kondaveeti Donga Movie

‘కొండవీటి దొంగ’ విషయంలో శ్రీదేవి ఆ షరతులు పెట్టారు: పరుచూరి గోపాలకృష్ణ

తాజాగా ‘పరుచూరి పలుకులు’ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ‘కొండవీటి దొంగ’ సినిమాను గురించి ప్రస్తావించారు. ‘కొండవీటిదొంగ’ సినిమా విడుదలై 30 ఏళ్లు అయింది. మొన్న పేపర్లో చూసి తెలియని ఆనందానికీ, ఉద్వేగానికి లోనయ్యాను. నాయకా నాయికలుగా చిరంజీవిని .. శ్రీదేవిని దృష్టిలో పెట్టుకుని ఈ కథను రాశాము. నిర్మాత త్రివిక్రమారావుగారు .. కథ అద్భుతంగా ఉందన్నారు.

చిరంజీవిగారికి కూడా కథ నచ్చేసింది .. హీరోయిన్ గా శ్రీదేవిని అనుకుంటున్నట్టుగా చెప్పి, ఆమెను కలిశాను. శ్రీదేవి ఇంటికి వెళ్లి నేనే కథ చెప్పాను. అంతా విన్న తరువాత ఈ సినిమా టైటిల్ ను ‘కొండవీటి రాణి – కొండవీటి దొంగ’ గా మార్చాలనే షరతు పెట్టారు. అలాగే లవ్ చేయమని హీరో వెంట హీరోయిన్ పడటాన్ని, హీరోనే హీరోయిన్ వెనక పడేలా మార్చమని అన్నారు. ఆ విషయం త్రివిక్రమరావుగారికి చెబితే, అలా కుదరదని చెప్పేశారు. ఆ తరువాత ఆ కథను ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా మార్చుకుని, రాధ – విజయశాంతిలతో చేశామని చెప్పుకొచ్చారు.
Tags: Chiranjeevi,Sridevi,Paruchuri Gopalakrishna,Kondaveeti Donga Movie

Corona Virus,Junior NTR,Ramcharan,Fans

‘కరోనా’ సోకకుండా ఉండడానికి చిట్కాలు చెబుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్… వీడియో ఇదిగో!

టాలీవుడ్ స్టార్లు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి, ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరూ కలిసి ఓ వీడియోలో కరోనా నుంచి ఎలా తప్పించుకోవాలన్న విషయమై ఫ్యాన్స్ కు, ప్రజలకు కొన్ని టిప్స్ చెప్పగా, ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. వైరస్ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీరు వివరించారు.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు డబ్ల్యూహెచ్ఓ ఆరు సూత్రాలను చెప్పిందని, వీటిని పాటిస్తే, సులువుగా తప్పించుకోవచ్చని అన్నారు. ఆ ఆరు సూత్రాలేంటో ఈ వీడియోను చూసి మీరు కూడా తెలుసుకోవచ్చు.
Tags: Corona Virus,Junior NTR,Ramcharan,Fans