Articles Posted in the " Andhra pradesh " Category

 • శాసనసభ ఆకృతిపై తుది నిర్ణయం 13న

  సీఎంతో రాజమౌళి సమావేశం అమరావతి పరిపాలన నగరంలో నిర్మించే శాసనసభ భవనం తుది ఆకృతిని ఈ నెల 13న ఖరారు చేయనున్నారు. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ సిద్ధం చేసిన ఆకృతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సమీక్షించారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ సమావేశంలో పాల్గొన్నారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రూపొందించిన ఆకృతుల […]


 • ఆ ప్రశ్న అంతర్మథనంలో పడేసింది: పవన్‌

  తెలుగు రాష్ట్రాల్లో యువత నిస్పృహలో ఉందని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వారిని జాగృతం చేసేందుకు `చ‌లో రే చ‌లో రే చ‌ల్‌` గీతాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతలుగా పర్యటించాలని ఆయన నిర్ణయించారు. తొలి విడత పర్యటనలో సమస్యల పరిశీలన, అధ్యయనం, వాటిని అవగాహన చేసుకోనున్నారు. రెండో విడత పర్యటనలో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో మూడో విడత పర్యటన […]


 • ప్రజా సేవల హామీ చట్టం

  గడువు మీరితే దరఖాస్తుదారుడికి పరిహారం చెల్లించాలి సంబంధిత అధికారి నుంచే వసూలు సభలో బిల్లు ప్రభుత్వం, ప్రభుత్వ ప్రాధికార సంస్థల నుంచి పౌరులు తమకు కావాల్సిన సేవలకు దన్నుగా నిలిచే ‘ఏపీ ప్రజా సేవల సమకూర్చు హామీ చట్టం-2017’ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనం పెంచేలా దీన్ని రూపొందించారు. పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు. * ప్రతి వ్యక్తి నిర్ణీత సమయంలోపు సేవలను పొందే హక్కు […]


 • పట్టిసీమ చెంత… ప్రజాప్రతినిధుల పులకింత

  పోలవరం సందర్శనలో 64 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎప్పుడో స్కూల్లోనో, కాలేజీలోనో చదివే రోజుల్లో బస్సు వేసుకుని వినోద యాత్రకో, విజ్ఞాన యాత్రకో వెళ్లుంటారు..! మళ్లీ ఇన్నేళ్లకు వారికి అలాంటి అవకాశం వచ్చింది. చట్ట సభల సభ్యులు మరోసారి చిన్న నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ… గురువారం ఉదయం విజయవాడ నుంచి ఆరు ప్రత్యేక బస్సుల్లో పోలవరం, పట్టిసీమ యాత్రకు తరలి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు శాసనసభ, శాసన మండలి సభ్యులు మొత్తం 64 […]


 • నా కార్యాలయంలోనే ఇన్ని రోజులా?

  దస్త్రాల పరిష్కారానికి (ఫైల్స్‌ క్లియరెన్స్‌) తన కార్యాలయ కార్యదర్శులు కూడా ఎక్కువ రోజులు తీసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గడచిన త్రైమాసికంలో వారి దగ్గర సగటున ఒక్కో ఫైలు 42 రోజుల 11 గంటలు ఉందన్నారు. ‘‘ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఇలా ఉంటే ఎలా? నాకంటే ముందే ఆఫీసుకి వస్తారో…ఇంకేం చేస్తారో? దస్త్రాలు మాత్రం పెండింగ్‌లో ఉండటానికి వీల్లేదు’’ అని వ్యాఖ్యానించారు. మంత్రులు, ఉన్నతాధికారుల వద్ద దస్త్రాలు ఎంతెంత కాలం అపరిష్కృతంగా (పెండింగ్‌) ఉంటున్నాయన్న అంశంపై […]


 • జగన్ కు నడుం నొప్పి .. ఒత్తిడి పడకుండా నడుం బెల్ట్ ధరించిన నేత!

  తొలిరోజు పది కిలోమీటర్లు నడవగానే జగన్ కు నడుంనొప్పి తిరుపతి నుంచి వచ్చిన ఫిజియోథెరపిస్టు ప్రాథమిక చికిత్స అనంతరం, నడుం బెల్ట్ ధరించమని సూచన నడుం బెల్ట్ ధరించి పాదయాత్ర కొనసాగిస్తున్న జగన్ వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన మూడు రోజులకే ఆయన నడుం నొప్పితో బాధపడుతున్నట్టు సమాచారం. తొలిరోజు పది కిలోమీటర్లు నడిచిన జగన్ నడుం నొప్పికి గురవడంతో అత్యవసరంగా ఫిజియోథెరపిస్ట్ ని పిలిపించి వైద్య సేవలందించినట్టు పార్టీ వర్గాల సమాచారం. […]


 • తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్! హైదరాబాద్ నుంచి అమరావతికి హైస్పీడ్ రైలు!

  ఇరు రాజధానుల మధ్య హైస్పీడ్ రైలుకు ప్రతిపాదనలు ఇరు ప్రభుత్వాలు సుముఖత ప్రతిపాదనను పరిశీలిస్తున్న రైల్వే శాఖ ఇటీవల జపాన్‌తో కలిసి హైస్పీడ్ రైలు మార్గానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. దేశంలో పలు సమస్యలుండగా హైస్పీడ్ రైలు అవసరమా? అన్న చర్చను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. ఇదిలా ఉండగానే ఇప్పుడు రైల్వే శాఖ సరికొత్త ప్రతిపాదన పరిశీలిస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి హైస్పీడ్ రైలు నడపాలన్నదే ఆ ప్రతిపాదన. ఈ ప్రాజెక్టుపై […]


 • బాబు దిగిపోతేనే జాబు

  ప్రభుత్వ ఉద్యోగులకు మంచిచేస్తా.. రైతులకు అండగా నిలుస్తాం కాసుల కక్కుర్తి లేదు.. కేసులకు భయపడను జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం డిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలని.. రైతులకు వ్యవసాయం పండగ చేయాలని, అధికారంలోకి వచ్చాక మద్యపానం పూర్తిగా తీసేయాలన్న కసి నాకుంది. నేను వెళ్లిపోయాక కూడా ప్రతి ఇంట్లోనూ నాన్న ఫొటో పక్కన నా ఫొటో ఉండాలి. అవినీతి మయం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని ఉంది. అవినీతిలో కూరుకున్న అందరినీ జైల్లో […]


 • ‘నారాయణ’ గురువుల పంచాయితీ..!

  ఆడియో టేపుల బహిర్గతంతో కలకలం ఉప్పల్‌ ఠాణాలో పరస్పరం ఫిర్యాదులు హైదరాబాద్‌లోని రామాంతపూర్‌ నారాయణ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ నవీన్‌, పాఠశాల ప్రిన్సిపల్‌ సరితా అగర్వాల్‌ మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్న ఆడియో టేపులు బుధవారం బహిర్గతమయ్యాయి. ప్రస్తుతం ఈ ఆడియో టేపులు పోలీస్‌స్టేషన్‌కు చేరాయి. ఈ టేపుల్లో ఒక కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ, ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న శ్రీలత ఉదంతం గురించి చర్చించారు. ఆమె అనుమానాస్పద మృతిని శవపరీక్ష సమయంలో మేనేజ్‌ చేశారని ఈ […]


 • పింఛన్లపై పిశాచాలు!

  చనిపోయిన వారి పేరిట భారీగా స్వాహా ‘ఖజానా’ల్లో రూ.వంద కోట్ల కుంభకోణం ‘సీతమ్మధార’లోనే రూ. కోట్లు హాంఫట్‌ విశాఖ జిల్లాలో రూ.25 కోట్ల గోల్‌మాల్‌ తెనాలిలో రూ.2 కోట్ల మేర అక్రమాలు ఒంగోలులో రూ.40 లక్షల చెల్లింపులు డైరెక్టరేట్‌లో పెద్ద తలకాయలకూ వాటాలు ప్రభుత్వ ఖజానా కార్యాలయాల్లో అవినీతి పిశాచాలు పేట్రేగిపోతున్నాయి. చనిపోయిన పింఛనుదారుల పేరిట వారు బతికున్నట్లు దొంగపత్రాలు సృష్టించి నకిలీ పింఛన్లు పీక్కుతింటున్న వైనాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ కుంభకోణం విలువ రూ.100 […]