బాలయోగి ఆశయాల సాధనకు అంకితవుతా

తన తండ్రి బాలయోగి ఆశయాల సాధనకు అంకితమై పని చేస్తానని అమలాపురం పార్లమెంట్ టిడిపి అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ చెప్పారు. కోనసీమ అభివృద్ధికి తన తండ్రి బాలయోగి చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఇంటా తన తండ్రి బాలయోగిని కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారని, ఆయన బిడ్డగా తనపైనా ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారని హరీష్ సంతోషం వ్యక్తం చేశారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయనని, మీ మధ్యనే మీలో ఒకడిగా ఉంటూ మీ సేవ చేసుకుంటానని చెప్పారు. ఆర్థిక లోటుతో ఏర్పడిన ఈ రాష్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ళలో రేయింబవళ్లు శ్రమించారని, మరో ఐదేళ్ళు ఆయనకు అధికారమిస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చెందుతుందని హరీష్ చెప్పారు. తనను సొంత తమ్ముడి కంటే ఎక్కువగా ఆదరిస్తున్న ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గ్రామాల సమగ్రాభివృధ్ది పట్ల, యువతకు ఉపాధి కల్పన పట్ల కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు.

గత ఏడాది కాలంగా రాజకీయ కార్యక్రమాల నిర్వహణపై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శిక్షణ పొందానని, తెలుగుదేశం అనే విశ్వవిద్యాలయంలో ఉత్తమ విద్యార్దిగా తనను తాను నిరూపించుకుంటానని హరీష్ మాథూర్ చెప్పారు. పి.గన్నవరంలో జిల్లా టిడిపి అధ్యక్షులు నామన రాంబాబు, మండల టిడిపి అధ్యక్షుడు ముచ్చర్ల సాయి సత్యనారాయణలతో కలిసి మీడియా ప్రతినిధులతోను, కార్యకర్తలతోను మాట్లాడిన అనంతరం రోడ్ షో ను హరీష్ ప్రారంభించారు. అనంతరం అంబాజీపేట మండలం లో మండల టిడిపి అధ్యక్షుడు గణపతి బాబులు, పిఎసిఎస్ అధ్యక్షుడు గణపతి రాఘవులు, ఎఎంసి మాజీ ఛైర్మన్ అరిగెల బలరామమూర్తి, ఎస్సీ నాయకులు నాగాబత్తుల సుబ్బారావు, విజయ భాస్కర రావు తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారంలో హరీష్ పాల్గొన్నారు. అక్కడి నుండి కొత్తపేట నియోజకవర్గంలోకి హరీష్ రోడ్ షో ప్రవేశించింది. జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నాయకుడు రెడ్డి రామకృష్ణ, తెలుగు యువత జిల్లా నాయకులు బండారు సంజీవ్ తదితరులు ఈ కార్యక్రమంలో టిటిడి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *