కుట్టు శిక్షణతో ఆర్థిక స్వావలంబన ఎ1 సేవా సమితి అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్

రావులపాలెం, నవంబర్ 16: తమ సంస్థ అందిస్తున్న ఉచిత కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని తూర్పుగోదావరి జిల్లా బిసి సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు, రాజోలు తాలూకా ఎ1సేవా సమితి అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని శ్రీనివాస్ శనివారం నాడు ప్రారంభించారు. శిక్షణకు అవసరమైన కుట్టు మిషన్లను ఉచితంగా అందజేశారు. వంద రోజుల పాటు ఈ శిక్షణ అందించి అనంతరం వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మట్టపర్తి సూర్యచంద్రరావు, మండల బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కట్టా వెంకటేశ్వర్లు, దేవరపల్లి గ్రామ టిడిపి అధ్యక్షులు మట్టపర్తి సుబ్రహ్మణ్యం, వాసంశెట్టి రామకృష్ణ, ఎ1సేవా సమితి ప్రతినిధులు కట్టా ప్రసాద్, కాండ్రేగుల పూర్ణ, స్థానిక మహిళా నేతలు చిట్టూరి లక్ష్మి, కుమారి, రెడ్డి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *