25 ఏళ్ల తర్వాత నేడు ఒకే వేదికపైకి బద్ధశత్రువులు మాయావతి-ములాయం సింగ్

25 ఏళ్ల తర్వాత నేడు ఒకే వేదికపైకి బద్ధశత్రువులు మాయావతి-ములాయం సింగ్

1995లో ఎస్పీ శ్రేణుల చేతిలో మాయావతికి తీవ్ర అవమానం
అప్పటి నుంచి కొనసాగుతున్న వైరం
ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న ఎస్పీ-బీఎస్పీ
దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత ములాయం సింగ్ యాదవ్-మాయావతి ఒకే వేదికపై కనిపించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ పుణ్యమా అని ఎస్పీ-బీఎస్పీల మధ్య ఉన్న వైరానికి తెరపడింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి చోటు లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు మొత్తం దేశాన్నే ఆకర్షించింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఎస్పీ కంచుకోట అయిన మెయిన్‌పురిలో ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీలు నిర్వహించనున్న ర్యాలీకి ములాయంసింగ్ యాదవ్-మాయావతి హాజరుకానుండడం హాట్ టాపిక్ అయింది. 1995లో స్టేట్ గెస్ట్ హౌస్‌లో మాయావతి, బీఎస్పీ కార్యకర్తలపై ఎస్పీ శ్రేణులు దాడులకు పాల్పడిన తర్వాత ఇద్దరు అధినేతల మధ్య విభేదాలు పొడసూపాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య రాజకీయ వైరం పెరిగింది. అప్పటి నుంచి బద్ధ శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు సీనియర్ నేతలు నేడు ఒకే వేదికపై కనిపించనున్నట్టు వార్తలు రావడంతో దేశ రాజకీయాల దృష్టి అటువైపు మళ్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *