2024 వరకైనా జనసేన పార్టీ ఉంటుందా అని అడుగుతున్నారు: పవన్ కల్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్ అమెరికాలో ప్రముఖ తెలుగు సంఘం తానా ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తానెవరికీ గులాంగిరీ చేయబోనని, ఆత్మగౌరవంతో ముందుకెళతానని స్పష్టం చేశారు. విజయం సాధిస్తే పొంగిపోవడం, ఓటమిపాలైతే కుంగిపోవడం తన నైజం కాదని అన్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం జనసేన కనీసం 2024 వరకైనా ఉంటుందా అని అడుగుతున్నారని తెలిపారు. అలాంటి వాళ్లందరికీ చెప్పేదొక్కటేనని, తన ఊపిరి ఉన్నంతవరకు పార్టీ నడుపుతానని స్పష్టం చేశారు.

డబ్బుతో ముడిపడిన రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం అని, రాజకీయ పార్టీ నడపాలంటే ఎన్నో కష్టనష్టాలుంటాయని తెలుసని, కానీ ప్రజలకు అండగా నిలవాలన్న తపనతోనే రాజకీయ ప్రయాణం మొదలుపెట్టానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అయితే, కోట్లాది మంది భవిష్యత్ ను నిర్దేశించేందుకు అనుభవం కూడా అవసరమని గుర్తించారని, అందుకే పార్టీ పెట్టినప్పుడే పాతికేళ్ల ప్రయాణం అని చెప్పానని గుర్తుచేశారు.
Tags: Pawan Kalyan,Jana Sena, Andhra Pradesh, USATANA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *