హరీష్ శంకర్ రెడీ.. క్రిటిక్స్‌ సిద్ధమా?

హరీష్ శంకర్ రెడీ.. క్రిటిక్స్‌ సిద్ధమా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ది ఆసక్తికర ప్రయాణం. అతడి మీద ఎక్కువ అంచనాలు పెట్టుకున్నపుడు నిరాశ పరుస్తాడు. అతడిని లెక్కలోకి తీసుకోనపుడు కసిగా పని చేసి హిట్టు కొడతాడు. గబ్బర్ సింగ్.. రామయ్యా వస్తావయ్యా.. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.. దువ్వాడ జగన్నాథం.. ఈ సినిమాల వరుస చూస్తే ఈ విషక్ష్ం అర్థమవుతుంది. ‘డీజే’ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే అతను నిరాశ పరిచాడు. ఇప్పుడు ‘వాల్మీకి’తో సత్తా చాటుతాడని చూస్తున్నారంతా. ఐతే ‘డీజే’ టైంలో అతను సమీక్షకులతో పాటు సినిమాను విమర్శించిన వాళ్లందరి మీదా పడిపోయాడు. తనో గొప్ప సినిమా తీశానన్నట్లుగా మాట్లాడాడు. సక్సెస్ మీట్లో అతడి వ్యాఖ్యలు అందరికీ అతిగానే అనిపించాయి. తీరా చూస్తే సినిమా ఫ్లాప్ అయింది. హరీష్‌కు ఇంకో సినిమా సెట్టవ్వడానికి చాలా టైం పట్టింది.

ఇప్పుడు హరీష్ నుంచి రాబోయే ‘వాల్మీకి’ సంగతేంటో చూడ్డానికి ఇటు క్రిటిక్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా సిద్ధంగా ఉన్నారు. దీన్ని అందరూ చాలా క్రిటికల్‌గా చూస్తారనడంలో సందేహం లేదు. ‘డీజే’ విడుదలకు ముందు హరీష్‌ను అందరూ పైకి లేపితే.. అతనేమో సరైన ఔట్ పుట్ ఇవ్వలేదు. పైగా హద్దులు దాటి మాట్లాడాడు. ఇప్పుడు అతను అతి కష్టం మీద సెట్ చేసుకున్న మీడియం రేంజ్ సినిమా వస్తోంది. దీని ప్రి టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు హరీష్ వెల్లడించగానే.. దీని సత్తా ఏంటో చూస్తామంటూ అందరూ కత్తులు పట్టుకుని రెడీ అయిపోతున్నారు. కాబట్టి ఔట్ పుట్ ఏమాత్రం తేడాగా ఉన్నా కూడా హరీష్‌ను ఏకేయడం ఖాయం. ప్రోమోలు అంచనాలకు తగ్గట్లు లేకపోతే మాత్రం సినిమాకు క్రేజ్ రావడం కష్టమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *