‘సైరా నరసింహా రెడ్డి’ కోసం రంగంలోకి ఉపాసన!

‘సైరా నరసింహా రెడ్డి’ నిర్మాతగా చరణ్
సుకుమార్ సినిమాతో చరణ్ బిజీ
అందువలన ‘సైరా’ పర్యవేక్షణ కోసం రంగంలోకి ఉపాసన
ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్
‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చరణ్ ‘రంగస్థలం 1985’ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. అందువలన ఆయన ‘సైరా’ సినిమాకి సంబంధించిన నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో సుకుమార్ సినిమాను పూర్తి చేసి చరణ్ వచ్చేలోగా, నిర్మాణ సంబంధమైన వ్యవహారాలను చక్కబెట్టడానికి ఉపాసన రంగంలోకి దిగుతున్నట్టుగా సమాచారం. వర్కింగ్ ప్రొడ్యూసర్ గా ఆమె ‘సైరా’ పనులను చూసుకుంటుందని అంటున్నారు. అక్టోబర్ 20వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. నయనతారతో పాటు పలువురు తెలుగు .. తమిళ .. హిందీ నటీనటులు కీలకమై పాత్రలను పోషించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *