సుబ్రహ్మణ్యం అన్నా, గౌతమ్ అన్నా… నన్ను గైడ్ చేయాలి!: ముఖ్యమంత్రి వైఎస్ జగన్

సీఎం గౌరవార్థం ప్రత్యేక విందు
నన్ను మీరే నడిపించాలి
ఐఏఎస్ లతో వైఎస్ జగన్
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ గౌరవార్థం, ఐఏఎస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ ప్రత్యేక విందును ఇచ్చిన వేళ, ఆ కార్యక్రమానికి తన భార్య భారతితో కలిసి వచ్చిన జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“నేను కొత్తగా అధికారంలోకి వచ్చాను. నాకు అనుభవం లేదు. అన్నలూ… మీరంతా నన్ను ముందుకు నడిపించండి. రాష్ట్రం కోసం అందరం కలిసి పనిచేద్దాం. అధికారం నాకు కొత్త. సుబ్రహ్మణ్యం అన్న (సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం), గౌతమ్‌ అన్న (డీజీపీ గౌతమ్ సవాంగ్), మన్మోహన్‌ అన్నలు నన్ను ముందుండి నడిపించాలి. నేను తీసుకునే నిర్ణయాల్లో ఏమైనా తప్పులు కనిపిస్తే సుబ్రహ్మణ్యం అన్న, గౌతమ్‌ అన్న గైడ్‌ చేయాలి. అందరం కలిసి పనిచేద్దాం. ప్రజలకు మంచి చేద్దామనుకుంటన్న నాకు మీరంతా సహకరించాలి” అని జగన్‌ కోరారు. కాగా, ఈ డిన్నర్ కార్యక్రమానికి వచ్చిన జగన్ దంపతులకు మన్మోహన్‌ సింగ్‌ సాదర స్వాగతం పలికారు.
Tags: ys jagan mohan reddy, party, IAS and IPS meeting, lv subramanyam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *