సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీపై మనసులోని మాటను బయటపెట్టిన పవన్ కల్యాణ్!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీపై మనసులోని మాటను బయటపెట్టిన పవన్ కల్యాణ్!

జనసేన పార్టీలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరడం చాలా సంతోషంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాలని తాను భావిస్తున్నట్లు అన్నారు. జేడీ రాయలసీమ నుంచి పోటీచేస్తే బాగుంటుందని తన మనసులోని మాటను ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ బయటపెట్టారు.

తమకు వామపక్షాలతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో పొత్తు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు బీఎస్పీ, వామపక్షాల నేతలతో తాను చర్చలు జరపనున్నట్లు ఆయన చెప్పారు.

ఈ చర్చల అనంతరం సాయంత్రం 5 గంటలలోపు జేడీ లక్ష్మీనారాయణకు కేటాయించే టికెట్ పై స్పష్టమైన ప్రకటన చేస్తామని పవన్ అన్నారు. చివరగా జైహింద్ అని తన ప్రసంగాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *