సీక్వెల్ దిశగా జగపతిబాబు 'శుభలగ్నం

సీక్వెల్ దిశగా జగపతిబాబు ‘శుభలగ్నం

హీరోగా జగపతిబాబు కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ‘శుభలగ్నం’ ఒకటిగా కనిపిస్తుంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1994లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జగపతిబాబును ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత చేరువ చేసింది. ఇక కథానాయికలుగా చేసిన రోజా .. ఆమని కెరియర్ కి కూడా ఈ సినిమా ఎంతో హెల్ప్ అయింది.

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ‘యాత్ర’ సినిమాను నిర్మించిన 70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమా ద్వారా ఒక కొత్త దర్శకుడు పరిచయమవుతాడని అంటున్నారు. ఇక ఈ సీక్వెల్ ను ఎవరితో చేస్తారు? ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది? అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *