సీఎం జగన్‌కు తప్పని ‘కోర్టు హాజరు’

  • సీఎం జగన్‌కు తప్పని ‘కోర్టు హాజరు’
  • రుజువయ్యాక వైదొలగిన మరికొందరు
  • వారం వారం వెళ్లాల్సిన పరిస్థితి జగన్‌దే
  • రాజీనామా చేయించిన బీజేపీ, కాంగ్రెస్‌

కాంగ్రెస్‌, బీజేపీలు అవినీతి ఆరోపణలతోపాటు ఇతర కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నతమ సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రులతో రాజీనామాలు చేయించాయి.

ఆ సందర్భాలు ఇవి :-

1994లో కర్ణాటకలోని హుబ్లీలో ఒక వివాదాస్పద స్థలంలో ఉమాభారతి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరేసిన తర్వాత చెలరేగిన ఘర్షణల్లో 10 మంది మరణించారు. ఈ కేసులో 2004లో కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. దాంతో మధ్య ప్రదేశ్‌ సీఎంగా ఉమాభారతితో బీజేపీ.. రాజీనామా చేయించింది.

బెంగళూరు, షిమోగలో భూకొనుగోళ్ల విషయంలో లాభం పొందారని, బళ్లారి ప్రాంతంలో ఇనుప ఖనిజాల అక్రమ మైనింగ్‌తో సంబంధాలున్నాయని కర్ణాటక లోకాయుక్త విచారణ జరిపి నివేదిక అందించడంతో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్పతో 2011లో బీజేపీ రాజీనామా చేయించింది.

కార్గిల్‌ యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాల కోసం ముంబయ్‌లో నిర్మించిన ఆదర్శ్‌ హౌసింగ్‌ సొసైటీ భవనాల్లో ఫ్లాట్లను మంత్రులు, అధికారులతో పాటు బంధువులకు కేటాయించారన్న ఆరోపణల నేపథ్యంలో అప్పటి మహారాష్ట్ర సీఎం అశోక్‌ చౌహాన్‌తో కాంగ్రెస్‌.. 2010లో పదవికి రాజీనామా చేయించింది.

హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంగా ఉన్న టైమ్‌లో వీరభద్ర సింగ్‌ అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ నమోదు చేసిన కేసులో ఆరోపణలు రుజువవ్వడంతో కేంద్ర మంత్రిగా ఉన్న ఆయనను కాంగ్రెస్‌ తప్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *