సింగూరు నిండింది.. మూసీ పొంగింది

మూసీ నుంచి 10 వేల క్యూసెక్కుల విడుదల

ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో పాటు తీర ప్రాంతంలో పడుతున్న వానల కారణంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు మంగళవారం పూర్తి సామర్థ్యానికి చేరువలోకి వచ్చింది. 523.6 మీటర్ల మట్టంతో 30 టీఎంసీల పూర్తి సామర్థ్యం కాగా, ప్రస్తుతం 523.3 మీటర్ల మట్టంతో 29.50 టీఎంసీలకు చేరుకుంది. దీంతో పాటు ఎగువ నుంచి 5,000 క్యూసెక్కుల వరద ఉద్ధృతి కొనసాగింది. ఉదయం జల విద్యుత్తు కేంద్రం ద్వారా 3,000 క్యూసెక్కులు కిందికి విడుదల చేశారు. 11 గంటల తరువాత వరద ఉద్ధృతి 6,000కు పెరగడంతో 13వ నంబరు క్రస్టుగేట్లను ఎత్తి 8,100 క్యూసెక్కులు వదిలారు. రెండింటి నుంచి 11,100 క్యూసెక్కులు మంజీరకు వదిలారు.
మూసీనది వరద నీటి ప్రవాహం జోరు
బీబీనగర్‌, భూదాన్‌పోచంపల్లి-న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నగరం, యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మంగళవారం మూసీ నది ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. భూదాన్‌ పోచంపల్లి, బీబీనగర్‌ మండలాల్లో 430 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *