శ్రుతి హాసన్ కాదు.. నయనతారే!

* ‘సైరా’ తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. ఇక ఇందులో కథానాయిక ఎవరన్న విషయమై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి శ్రుతి హాసన్ ని తీసుకున్నారని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఇందులో వాస్తవం లేదని నయనతారనే మళ్లీ ఎంచుకున్నారని తాజా సమాచారం.
* గతేడాది రామ్ చరణ్ నటించిన హిట్ చిత్రం ‘రంగస్థలం’ ఇప్పుడు కన్నడలోకి డబ్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘రంగస్థలి’ పేరిట అనువదించగా, ఈ నెల 12న కన్నడ నాట ఇది భారీ ఎత్తున రిలీజవుతోంది.
* దర్శకురాలు నందినిరెడ్డి రూపొందించిన ‘ఓ బేబి’ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. మరోపక్క ఆమె తన తదుపరి చిత్రానికి కూడా రెడీ అవుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నానని, ఓ స్టార్ హీరో ఇందులో నటిస్తాడని నందిని రెడ్డి తాజాగా చెప్పింది.
Tags: Shruti Hassan,Chiranjivi,Nayanathara,Ramcharan,Samantha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *