వైసీపీ ఇమేజ్ రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతింది: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

వైసీపీ ఇమేజ్ రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతింది: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

వైఎస్ వివేకా హత్యకు కారణం చంద్రబాబేనని ఆరోపణలు చేయడం తగదని అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వివేకా హత్య కేసుపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతున్నప్పటికీ, బాబుపై బురదజల్లడం తగదని వైసీపీకి హితవు పలికారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వైసీపీ ఇమేజ్ రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిందని, అటువంటి పిల్లచేష్టలతో జగన్ నష్టపోతున్నాడని అన్నారు.

ఇక మళ్లీ మోదీ ప్రధాని అయితే, ఇప్పటి వరకు చీకట్లో ఉన్న ఏపీ కటిక చీకట్లోకి వెళుతుందని, అటువంటి వ్యక్తితో జగన్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మోదీని గద్దె దింపకపోతే ఏపీ బతికి బట్టకట్టదని అభిప్రాయపడ్డారు. ఇది వరకు చిన్నపిల్లలు ఏడుస్తుంటే ‘బూచోడొచ్చాడు’ అంటే ఏడుపు ఆపి వేసేవారని, ఇప్పుడు మాత్రం ‘మోదీ వచ్చాడు’ అంటే ఏడుపు ఆపుతున్నారని సెటైర్లు విసిరారు. ఏపీలో మోదీ-జగన్ లిద్దరూ రాజకీయంగా సమాధి కావాల్సిందేనని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *