వెంకయ్య నాయుడుకి తన సత్తా ఏమిటో చూపిస్తున్న జగన్

వెంకయ్య నాయుడు ఈ పేరు తెలుగు రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళకి బాగా గుర్తువుండిపోయే పేరు. ఆంధ్రప్రదేశ్ కి ఢిల్లీలో పెద్ద మనిషిగా చలామణి అయ్యే వ్యక్తి. గతంలో ఢిల్లీ స్థాయిలో ఏ పని కావాలన్నా ఆంధ్ర నాయకులు వెళ్ళేది ఒక్క వెంకయ్య దగ్గరకే, అలాంటి వెంకయ్య నాయుడుని ఉపరాష్ట్రపతి చేసి మోడీ చేతులు కట్టేశాడు. దీనితో ఏమి చేయాలో పాలుపోగా సైలెంట్ గా చూస్తూ వున్నాడు, అయిన సరే ఆయనకి ఆంధ్ర మీద మక్కువ పోలేదు. అయితే ఆంధ్ర కొత్త ముఖ్యమంత్రి జగన్ కూడా తనదైన శైలిలో వెంకయ్య నాయుడుకి ఝలక్ ఇస్తున్నాడని తెలుస్తుంది.

ఆంధ్రాకి పెద్ద దిక్కు నేనే, జగన్ సీఎం అయిన తర్వాత సరాసరి నా దగ్గరకి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాడని వెంకయ్య నాయుడు భావించినట్లు తెలుస్తుంది. జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఆయన అక్కడే ఉంటున్నాడు, కానీ జగన్ మాత్రం కనీసం మాట వరసకైనా ఆయన్ని కలిసింది లేదు. దీనితో వెంకయ్య నాయుడు తెగ ఫీలైపోతున్నట్లు తెలుస్తుంది. అయితే జగన్ కావాలనే ఆయన్ని పక్కన పెట్టటం వెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు కి -వెంకయ్య కి మధ్య వున్నా స్నేహం అందరికి తెలిసిందే, బాబు కోసం ఏకంగా పార్టీనే పక్కన పెట్టె నైజం వెంకయ్యది.

గతంలో రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎదగకుండా చేయటానికి ఢిల్లీ స్థాయిలో వెంకయ్య చాలానే చేశాడనేది కొందరు చెప్పే మాటలు, ఆ తర్వాత జగన్ సొంత పార్టీ పెట్టినప్పుడు జగన్ ఎదగనివ్వకుండా చేయటానికి తన వంతు ప్రయత్నాలు చేశాడని, జగన్ జైలుకి పోవటం వెనక వెంకయ్య నాయుడు హస్తముందని భావిస్తున్నారు, ఇవన్నీ తెలిసిన జగన్ కావాలనే వెంకయ్య నాయుడుని దూరం పెడుతున్నట్లు తెలుస్తుంది. ఎలాగూ మోదీ, అమిత్ షా ఇద్దరు జగన్ తో ఇప్పటికైతే సన్నిహితంగా ఉన్నారు కాబట్టి జగన్ కి వెంకయ్యతో పెద్దగా పనేమీ లేదు.
Tags: venkaiah naidu, cm jagan mohan reddy, AP CM, delhi parliament

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *