విశాల్ తో తమన్నా మరో సినిమా

విశాల్ తో తమన్నా మరో సినిమా

* మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా విశాల్ సరసన మరో సినిమాలో నటించడానికి కూడా ఓకే చెప్పింది. ఇప్పటికే సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో విశాల్ సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు తాజాగా మరో చిత్రంలో నటించే అవకాశం కూడా వచ్చింది. నూతన దర్శకుడి దర్శకత్వంలో ఇది తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.
* లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంచన 3’ హారర్ సినిమా తెలుగు హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల ప్రదర్శన హక్కులను ఠాగూర్ మధు 12 కోట్లకు తీసుకున్నట్టు సమాచారం.
* అనుష్క కథానాయికగా నటించే ‘సైలెన్స్’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి అమెరికాలో జరుగుతుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పలు భాషలలో రూపొందే ఈ చిత్రంలో మాధవన్ తో పాటు హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *