వికటించిన ఫేస్ క్రీమ్… కోమాలోకి వెళ్లిన మహిళ

  • అమెరికాలో ఘటన
  • ముఖం మచ్చలు పొగొట్టుకునేందుకు క్రీమ్ వినియోగం
  • అస్వస్థతకు గురైన మహిళ
  • చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిన వైనం

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ ఫేస్ క్రీమ్ కారణంగా కోమాలోకి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. తన ముఖంపై విపరీతంగా మచ్చలు ఉండడంతో వాటిని తొలగించుకునేందుకు ఆ మహిళ ఫేస్ క్రీమ్ కొనుగోలు చేసింది. ప్రత్యేకంగా మెక్సికో నుంచి ఆ క్రీమ్ ను తెప్పించింది. అయితే, ఈ క్రీమ్ పూసుకోగానే అస్వస్థతకు గురైంది.

కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, కొన్నిరోజులకే కోమాలోకి జారుకుంది. ఆమె వాడిన క్రీమ్ ను పరిశీలించిన వైద్యులు అందులో మిథైల్ మెర్క్యురీ అనే రసాయనం ఉన్నట్టు గుర్తించారు. కొన్ని అరుదైన సందర్భాల్లో ఆ రసాయనం విషప్రభావాన్ని సంతరించుకుంటుందని వివరించారు. అది కల్తీ ఫేస్ క్రీమ్ అయ్యుంటుందని, అందుకే వికటించి ఉంటుందని డాక్టర్లు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *