ల‌గ‌డ‌పాటి స‌ర్వే మాయ‌లో.. 40 ఇయ‌ర్స్ చంద్ర‌బాబు.. ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌నం..!

ల‌గ‌డ‌పాటి స‌ర్వే మాయ‌లో.. 40 ఇయ‌ర్స్ చంద్ర‌బాబు.. ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌నం..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప‌లితాలు రాకుండా, ప్ర‌ధాన పార్టీలు గెలుపు, ఓటముల పై ఎవ‌రికి వారు లెక్క‌లు వేసుకుంటూ గెలుపు పై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ నేత‌లు మేమే గెలుస్తామాని, మాకు 130 కంటే ఎక్కువ సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, చెబుతున్నారు. ఇక మ‌రోవైపు వైసీపీ నేత‌లు కూడా ఏమాత్రం త‌గ్గ‌కుండా ఈసారి గెల‌పు మాదే అని, మాకు 120 సీట్లు ప‌క్కా అంటున్నారు. అలాగే జ‌న‌సేన కూడా మేము కూడా రేసులో ఉన్నామ‌ని, తామే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని చెబుతున్నారు.
ఈ నేప‌ధ్యంలో తాజాగా సీనియ‌ర్ పొలిటీష‌న్ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి. చంద్ర‌బాబు మ‌ళ్ళీ అధికారంలోకి వ‌స్తుంద‌ని 130 సీట్లు వ‌స్తాయ‌ని చెబుతున్నార‌ని, అయితే ఆ ధీమా వెనుక ఒక కార‌ణం ఉంద‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చేసిన స‌ర్వేలో టీడీపీ మ‌రోసారి విజ‌యం సాధిస్తుంద‌ని తేలింద‌ని, ఆ స‌ర్వే రిపోర్ట్స్ చంద్ర‌బాబుకు ఇచ్చార‌ని, అది ప‌ట్టుకుని చంద్ర‌బాబు మ‌ళ్ళీ తామే గెలుస్తామ‌ని అంటున్నార‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు.

అయితే ల‌గ‌డ‌పాటి స‌ర్వేని పూర్తిగా లైట్ తీసుకోలేము కానీ, ఈసారి ఫ‌లితాలు మాత్రం టీడీపీకి అనుకూలంగా వ‌చ్చే ప‌రిస్థితులు మాత్రం త‌న‌కు క‌న‌బ‌డ‌డంలేద‌ని, ఎందుకంటే ఎన్నిక‌ల‌కు రెండు నెల‌లు ముందు వ‌రాలు ఇచ్చినంత మాత్రాన రాత్రికి రాత్రే ప్ర‌జ‌లు టీడీపీ వైపు ట‌ర్న్ అవుతార‌ని అనుకుంటే అది పొర‌పాటే అని ఆ విష‌యం 40 ఏళ్ళ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబుకు తెలియంది కాద‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు. ఇక ల‌గ‌డ‌పాటి స‌ర్వే అంచానాలు తెలంగాణ‌లో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని, సో ఇప్పుడు ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఫ‌లితాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నా, వైసీపీ గెలిచే అవ‌కాశాల‌ను కొట్టి పారేయ‌లేమ‌ని ఉండ‌వ‌ల్లి స్ప‌ష్టం చేశారు. మ‌రి ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎవ‌రికి అనుకూలంగా ఉంటాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *