లండన్ నుంచి బయలుదేరిన చంద్రబాబు… నేడు హైదరాబాదుకి రాక!

గత వారం రోజులుగా లండన్ లో చంద్రబాబు ఫ్యామిలీ
ముగిసిన పర్యటన, రేపు అమరావతికి
వెళ్లగానే నేతలతో భేటీ
గడచిన వారం రోజులుగా లండన్ లో తన కుటుంబంతో విహారంలో ఉన్న చంద్రబాబునాయుడు, నేడు హైదరాబాద్ కు రానున్నారు. తన పర్యటనను ముగించుకున్న ఆయన గత రాత్రి విమానంలో బయలుదేరారు. నేడు ఇండియాకు రానున్న ఆయన, రేపు అమరావతికి వెళ్లనున్నారు. ఆపై తనకు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారని తెలుస్తోంది. కాగా, చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లగానే, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లతో పాటు నలుగురు పార్టీ ఫిరాయించారు. వీరితో పాటు మరింత మంది ప్రజా ప్రతినిధులు టీడీపీని వీడుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి రాజకీయ వ్యూహాత్మక అడుగులు వేస్తారన్న విషయమై చర్చ సాగుతోంది.
Tags: london tour, chandrababu naidu, hyderabad,amaravathi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *