రెండు పాత్రల్లోను బాలయ్య దుమ్మురేపేస్తాడట

యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘రూలర్’
రెండు పాత్రల్లోను బాలయ్య భారీ ఫైట్లు
త్వరలో ప్రేక్షకుల ముందుకు
బాలకృష్ణ కథానాయకుడిగా ‘కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ నిర్మితమైంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలను పోషించారు. ఒక పాత్రలో ఆయన పోలీస్ ఆఫీసర్ గాను .. మరో పాత్రలో బిజినెస్ మేన్ గాను కనిపించనున్నాడు. సాధారణంగా హీరోలు రెండు పాత్రలను చేసినప్పుడు ఒక పాత్ర అదరగొట్టేసేదిగా .. మరో పాత్రను కాస్త అమాయకంగా డిజైన్ చేస్తుంటారు.

కానీ ఈ సినిమాలో అలా కాదట. ఈ రెండు పాత్రలు కూడా యాక్షన్ సీన్స్ లో దుమ్మురేపేస్తాయని అంటున్నారు. శత్రువులతో ఈ రెండు పాత్రలు తలపడే సీన్స్ ఒక రేంజ్ లో వుంటాయని చెబుతున్నారు. ఇక రొమాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. బాలయ్య అభిమానులకు అన్నిరకాల మసాలాలను ఈ సినిమాతో అందించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. సోనాల్ చౌహాన్ – వేదిక కథానాయికలుగా నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags: Balakrishna, Sonal Chauhan, Vedika

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *