రాష్ట్ర ప్రయోజనాలపై స్పందించండి: ఉండవల్లికి ప్రవాసాంధ్రుల బహిరంగ లేఖ

రాష్ట్ర ప్రయోజనాల కోసం మరోమారు స్పందించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు ప్రవాసాంధ్రులు బహిరంగ లేఖ రాశారు. ఏపీ ప్రయోజనాల కోసం పరితపించే వ్యక్తిగా ఆయనంటే ఎంతో గౌరవం ఉందని లేఖలో పేర్కొన్న ప్రవాసాంధ్రులు.. గోదావరి జలాల విషయంలో మరోసారి స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించే కొత్త ప్రతిపాదనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మీలాంటి మేధావులు ఇటువంటి విషయాలపై స్పందించి, ఆ నిర్ణయం మేలా? కీడా? అన్న విషయాన్ని బహిరంగంగా చర్చించాలని కోరారు. విభజన సమయంలోనూ, ఆ తర్వాత జరిగిన పరిణామాల విషయంలోనూ ఉండవల్లి వ్యవహరించిన తీరు ఆయనపై మరింత గౌరవం పెంచిందని లేఖలో పేర్కొన్నారు.
Tags: Undavalli Arun Kumar,Andhra Pradesh,NRI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *