రామ్ మూవీ సరికొత్త రికార్డు

రామ్ మూవీ సరికొత్త రికార్డు

రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా, 2017 అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లావణ్య త్రిపాఠి .. అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, శ్రీవిష్ణు ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. స్రవంతి రవికిశోర్ .. కృష్ణ చైతన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఓ మాదిరిగా ఆడింది.

అలాంటి ఈ సినిమాను గోల్డ్ మైన్స్ టెలీ ఫిలిమ్స్ సంస్థ హిందీలోకి అనువదించి యూ ట్యూబ్ లో విడుదల చేసింది. ‘నెం.1 దిల్ వాలా’ పేరుతో హిందీలోకి అనువదించబడిన ఈ సినిమాను, వారం కూడా తిరక్కముందే యూ ట్యూబ్ లో మూడున్నర కోట్ల మంది చూడటం విశేషం .. నాలుగున్నర లక్షల లైకులు రావడం మరో విశేషం. యూ ట్యూబ్ లో ఈ సినిమాను ఇంత తక్కువ సమయంలో ఇన్ని కోట్లమంది వీక్షించడం ఒక రికార్డుగా చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *