‘రాజ్ దూత్’ నుంచి ఆకట్టుకునే లిరికల్ వీడియో సాంగ్

శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా ‘రాజ్ దూత్’ సినిమా రూపొందుతోంది. కార్తీక్ – అర్జున్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మేఘాంశ్ జోడీగా ‘నక్షత్ర’ కనిపించనుంది. మాస్ టచ్ తో కూడిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి సంబంధించిన లిరికల్ వీడియోను తాజాగా వదిలారు.

“మనసున మనసున ఏదో ఆశ .. మొదలే ఇవ్వాళ .. కనులకు కనులకు రాదే నిదుర అరెరే అనేలా .. కలలోనా నువ్వేకదా .. ఎదలోనా నువ్వేకదా” అంటూ ఈ పాట సాగుతోంది. వరుణ్ సునీల్ సంగీతం .. కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం .. సిద్ధార్థ్ మీనన్ ఆలాపన యూత్ కి కనెక్ట్ అయ్యేలా వున్నాయి. నిర్మాతగా సత్యనారాయణ వ్యవహరిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మేఘాంశ్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *