సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆకర్షించేందుకు బీజేపీ ఎప్పటి నుంచో యత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు బీజేపీ చీఫ్ అమిత్ షా బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

రజనీకాంత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన అమిత్ షా?

సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆకర్షించేందుకు బీజేపీ ఎప్పటి నుంచో యత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు బీజేపీ చీఫ్ అమిత్ షా బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరితో తమిళనాడు పార్టీ పగ్గాలను అప్పగించడమే కాకుండా… ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటిస్తామని అమిత్ షా చెప్పినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలతో తమిళనాడు రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ప్రధాని మోదీ, అమిత్ షాలు వ్యూహరచన చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై వారు మరింత ఫోకస్ చేస్తున్నారు.

ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ, అమిత్ షాలను కృష్ణార్జునులుగా రజనీకాంత్ పోల్చిన సంగతి తెలిసిందే. కశ్మీర్ విషయంలో మోదీ, షా ద్వయం తీసుకున్న నిర్ణయాలను రజనీ ఆకాశానికెత్తేశారు. ఈ నేపథ్యంలో, బీజేపీ పట్ల రజనీ సానుకూల ధోరణితో ఉన్నారనే విషయం అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. రజనీ తమతో చేయి కలిపితే… తమిళనాట పాగా వేయవచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *