యాక్షన్ తో దుమ్ము రేపేస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్'

యాక్షన్ తో దుమ్ము రేపేస్తోన్న ‘ఇస్మార్ట్ శంకర్’

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ రూపొందుతోంది. పూరి సొంత బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమా, ఇటీవలే రెగ్యులర్ షూటింగుకి వెళ్లింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ – అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. రామ్ తదితరులపై ఒక యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు.

ఈ సినిమాలో రామ్ సరసన కథానాయికలుగా నిధి అగర్వాల్ .. నభా నటేశ్ కనిపించనున్నారు. హీరోగా ఇటు రామ్ కి .. దర్శకుడిగా అటు పూరికి ఈ మధ్య కాలంలో హిట్ లేదు. అందువలన ఇద్దరికీ ఈ సినిమా చాలా కీలకం. ఈ కారణంగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారట. మరి ఈ ఇద్దరూ ఆశించే హిట్ ఈ సినిమా ఇస్తుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *