నన్ను చంపేయాలన్నంత కసితో రగిలిపోతున్నారు: కాంగ్రెస్ నేతలపై మోదీ ఫైర్

మోదీ పీఎం అయితే బాబుకు బ్యాండేనా?

దిల్లీ పీఠంపై మ‌ళ్లీ ప్ర‌ధానిగా మోదీ ఆసీనులు కాబోతున్నారా?. దేశ వ్యాప్తంగా ప్ర‌జలంతా మ‌ళ్లీ మోదీకే ప‌ట్టం క‌ట్ట‌బోతున్నారా? అంటే జాతీయ స్థాయి స‌ర్వేల‌న్నీ ముక్త‌కంఠంతో అవున‌నే స‌మాధానం చెప్ప‌డం విప‌క్షాల‌నే కాదు రాజ‌కీయ విమ‌ర్శ‌కుల్ని కూడా విస్మ‌యానికి గురిచేస్తోంది. ఏ పార్టీ మ‌ద్ద‌తును ఆశించ‌కుండా మోదీ మ‌రోసారి ప్ర‌ధాని పీఠం ఎక్క‌బోతున్నార‌ని 300ల‌కు పై చిలుకు స్థానాల్ని ఎన్డీఏ సాధించ‌బోతోంద‌ని స‌ర్వేల‌న్నీ తేల్చేశాయి. మ‌రి మోదీ గెలిస్తే ఎవ‌రికి న‌ష్టం?. ముందు ఎర్త ప‌డేది ఎవ‌రికి?. మోదీ ప్ర‌ధాని అయితే ముందు బ్యాండు ప‌డేది ఎవ‌రికి? ప‌్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ ఇది.

మోదీ ప్ర‌ధాని అయితే ముందు ఇబ్బందులు ఎదుర్కొనేది టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడే. గ‌త కొంత కాలంగా మోదీని బాబు తిట్టినంత‌గా ఈ దేశంలో ఏ రాజ‌కీయ నాయ‌కుడు దూషించ‌లేదు. చివ‌రికి దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా బాబు త‌రువాతే అని అంతా అంటున్నారు. ఏపీ ఎన్నిక‌ల ముందు ప‌క్కాగా చెప్పాలంటే ఎనన్డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాల నుంచి వైదొలిగిన త‌రువాత నుంచి చంద్ర‌బాబు నాయుడు మోదీపై నిప్పుల వ‌ర్షం కురిపిస్తున్నారు. మోదీ పేరెత్తితేనే అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నారు. అక్క‌డితో ఆగ‌క కూట‌మి పేరుతో మోదీని ప్ర‌ధాని పీఠం నుంచి దింపాల‌ని బాబు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. గ‌త కొన్ని నెల‌లుగా యూపీఏ ప‌క్షాల‌ని ఏకం చేస్తూ మోదీపై బాబు యుద్ధ‌మే చేస్తున్నారు.

తాజాగా మోదీనే ప్ర‌ధాని అవుతార‌ని స‌ర్వేల‌న్నీ తేల్చ‌డంతో బాబుకు ఇక బ్యాండే అంటూ స‌ర్వ‌త్రా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏపీలో ముఖ్య‌మంత్రి పీఠం బాబు చేయి జారుతోంద‌ని, ఈ ద‌ఫా జ‌గ‌నే సీఎం అని జాతీయ స‌ర్వేలు వ‌రుస బాంబులు పేల్చ‌డంతో బాబు ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది. మోదీ ప్ర‌ధాని అయ్యాక చంద్ర‌బాబుపై విచార‌ణ చేయించ‌డం ఖాయం అని, 17 కేసుల్లో స్టే తెచ్చుకున్న బాబు ఏదో ఒక కేసులో దొరికితే క‌ట‌క‌టాలు లెక్కించ‌క త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ అవ‌కాశాన్ని వాడుకుని మోదీ బాబును ముప్పుతిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించ‌డం ఖాయంగా క‌నిపిస్తోందని మ‌రీ నొక్కి చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *